Share News

kumaram bheem asifabad- అకాల వర్షం.. దెబ్బతిన్న పంటలు

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:06 PM

జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం కురిసన వర్షానికి పంటలు తడిసిపోయాయి. ఆసిఫాబాద్‌ మండలంలో బుధవారం తెల్లవారు జామున ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. ఈదురుగాలుల బీభత్సానికి మండలంలోని రైతులు సాగు చేస్తున్న జొన్న పంట పూర్తిగా నేల వాలింది. కోత దశలో ఉన్న పంట అకాల వర్షంతో నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారు. దె

kumaram bheem asifabad- అకాల వర్షం.. దెబ్బతిన్న పంటలు
ఆసిఫాబాద్‌లో నేలకొరిగిన జొన్న పంట

ఆసిఫాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం కురిసన వర్షానికి పంటలు తడిసిపోయాయి. ఆసిఫాబాద్‌ మండలంలో బుధవారం తెల్లవారు జామున ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. ఈదురుగాలుల బీభత్సానికి మండలంలోని రైతులు సాగు చేస్తున్న జొన్న పంట పూర్తిగా నేల వాలింది. కోత దశలో ఉన్న పంట అకాల వర్షంతో నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారు. దెబ్బతిన్న పంటకు ప్రభత్వుం నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలో రైతులు సాగు చేస్తున్న పత్తి, కంది, పెసర పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. ఇప్పటికే పత్తి ఆలస్యంగా చేతికి రావడంతో ఇంకా చేలలోనే తీయకుండా ఉంది. కురిసిన ఈదురుగాలులు భారీ వర్షానికి పత్తిపంటకు తీరని నష్టాన్ని కలిగిచింది. అదే విధంగా పంట చేలనులలో కోసి ఉంచిన కంది, పెసర పంటలు కూడా వర్షానికి తడిచి పోవడంతో మొలకెత్తే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండలంలో బుధవారం ఉదయం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. మండలంలో రైతులు సాగు చేస్తున్న పత్తి, మిరప, కంది పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. ఇప్పటికే పత్తి ఆలస్యంగా చేతికి రావడంతో ఇంకా చేలలోనే తీయకుండా ఉంది. కురిసిన ఈదురుగా లులు భారీ వర్షానికి పత్తిపంటకు తీరని నష్టాన్ని కలిగిచింది. ఏరివేత పూర్తైన పత్తి కుప్పలు తడిసి సోయాయి. పంట చేల్లో ఆరబెట్టిన కంది, పెసర పంటలు కూడా వర్షానికి తడిచి పోవడంతో మొలకెత్తే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండలంలో రైతులు సాగు చేస్తున్న పత్తి, మిరప, కంది పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. ఇప్పటికే పత్తి ఆలస్యంగా చేతికి రావడంతో ఇంకా చేలలోనే తీయకుండా ఉంది. కురిసిన ఈదురుగాలులు భారీ వర్షానికి పత్తిపంటకు తీరని నష్టాన్ని కలిగిచింది. ఆరబెట్టిన పత్తి కుప్పలు తడిసి పోయాయి. ఈదురుగాఉలలు భారీ వర్షానికి పత్తి, మిరప పంటలకు తీరని నష్టాన్ని కలిగించింది.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండలంలో కురిసిన వర్షానికి చేతికి అందివచ్చిన పంటలు పత్తి, పెసర, కంది, మిర్చి తడిసి ముద్ద అయ్యాయి. ఈదురుగాలుల వర్షానికి పంటలు తడిసి రాలిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కంది, పెసర పంటలు తడిసి పోయి మొలకెత్తుతుందిన రైతులు ఆవేదన చెబుతున్నారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా అకాల వర్షం, ఈదురుగాలులతో మామిడి రైతులకు నష్టం వాట్లింది. పింద దశలో ఉన్న మామిడి కాయలు ఈదురుగాలుల తీవ్రతకు రాలిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. చేలల్లో ఏరకుండా ఉన్న పత్తి తడిసి ముద్దయిందని రైతులు తెలిపారు.

Updated Date - Mar 18 , 2026 | 11:06 PM