kumaram bheem asifabad-తేలని టికెట్లు.. తప్పని పరీక్ష
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:20 PM
పురపాలక ఎన్నికలకు సంబంఽధించి నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. కానీ ప్రధాన పార్టీల అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడంతో ఆశావహులకు పరీక్షలా మారింది.
- రెబల్స్ కట్టడికి ప్రధాన పార్టీల వ్యూహాత్మక అడుగులు
- సంప్రదింపులు, బుజ్జగింపులకు శ్రీకారం
ఆసిఫాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): పురపాలక ఎన్నికలకు సంబంఽధించి నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. కానీ ప్రధాన పార్టీల అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడంతో ఆశావహులకు పరీక్షలా మారింది. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల తో పాటు ఇతర పార్టీలు అభ్యర్థులను ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. ఒక్క ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ అభ్యర్థు ల జాబితాను ప్రకటించినా ఇతర పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ క్రమంలో చివరి రోజు ఆయా పార్టీలకు చెందిన ఆశావ హులు అధిక సంఖ్యలో నామినేషన్ కేంద్రాలకు పోటెత్తి నామినేషన్ పత్రాలను సమర్పించారు. దాదాపు అన్ని పార్టీలోను అందరు రెండు సెట్లు (పార్టీ తరపున, స్వతంత్రంగా) దాఖలు చేసిన ట్లు తెలుస్తోంది.
- జిల్లాలో 396 నామినేషన్లు..
జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆసిఫాబాద్ మున్సి పాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా 166 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రె స్ 47, బీఆర్‌ఎస్ 37, బీజేపీ 30, బీఎస్పీ 4, సీపీఎం 1 ఇతర పార్టీల నుంచి 13, స్వతంత్రులుగా 34 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డు లు ఉండగా 230 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ 56, బీఆర్‌ఎస్ 73, బీజేపీ 48, బీఎస్పీ 19, సీపీఐ(ఎం) 2, ఎంఐఎం 4, ఇతర పార్టీల నుంచి 8, స్వతంత్రులు 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దాఖలైన నామినే షన్లను అదికారులు శనివారం పరిశీలించారు.
- స్వతంత్రులుగా అయినా..
ఆయా పార్టీల టికెట్లు ఆశించి ముందస్తు గానే నామినేషన్లు వేసిన నాయకులకు అభ్యర్థి త్వాలు దక్కకపోవడంతో ఇతర పార్టీల నుంచి, స్వతంత్రులుగా కొనసాగేందుకు మొగ్గు చూపు తున్నారు. రెబల్స్ బరిలో ఉంటే ఆయా పార్టీల అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయా పార్టీలకు చెందిన ఆదినాయకులు వారి ని బుజ్జగించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నా రు. కొన్నిచోట్ల అభ్యర్థులను బుజ్జగించిన ఫలితం లేకుండా పోయింది. అభ్యర్థులు తమకే పార్టీ టికెట్ ఇస్తుందని చివరి వరకు వేచి ఉన్నారు. టికెట్ దక్కని వారు ఇతర పార్టీలవైపు మొగ్గు చూపుతున్నారు. రాత్రికిరాత్రే పార్టీలు మారి కండువాలు కప్పుకొని ఆ పార్టీ మద్దతుతో బీఫామ్ పొంది బరిలో నిలిచేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఒకే వార్డు నుంచి ముగ్గురు నుంచి నలుగురు పోటీ పడ డంతో ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. దీంతో ఆయా పార్టీలలో ఆందోళన మొదలైంది.
- ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్ష:
మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్షగా మారాయి. ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో ఆయా పార్టీలు గెలుపుపై దృష్టి సారించాయి. రాష్ట్రంలో అధి కారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని రెండు మున్సిపాలిటీలలో చేజిక్కుంచుకునేందుకు అన్ని విధాలుగా యత్నిస్తోంది. గత సర్పంచ్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్, బీజేపీలు సైతం మున్సిపాలిటీల్లో సత్తా చాటేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకుంటు న్నాయి. ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ అను సరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహలను రచిస్తున్నాయి. ఎలగైనా మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి చైర్మన్ పీఠాలను దక్కించుకోవాలనే ధృడ నిశ్చయంతో ప్రధాన పార్టీలు ముందుకెళుతున్నాయి.