kumaram bheem asifabad-తేలని పీఎఫ్ సమస్య
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:47 PM
కాగజ్నగర్ మున్సిపాలిటీలో పని చేసే కాంట్రాక్టు కార్మికులు పీఎఫ్ సమస్యను అధికారులు తేల్చడం లేదు. కష్టపడి పని చేసిన కార్మికులకు భవిష్యత్తులో భరోసా కల్పించాల్సిన ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) సొమ్ము సకా లంలో చెల్లించక పోవడంతో కాగజ్నగర్ మున్సిపా లిలోని కాంట్రాక్టు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్
కాగజ్నగర్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): కాగజ్నగర్ మున్సిపాలిటీలో పని చేసే కాంట్రాక్టు కార్మికులు పీఎఫ్ సమస్యను అధికారులు తేల్చడం లేదు. కష్టపడి పని చేసిన కార్మికులకు భవిష్యత్తులో భరోసా కల్పించాల్సిన ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) సొమ్ము సకా లంలో చెల్లించక పోవడంతో కాగజ్నగర్ మున్సిపా లిలోని కాంట్రాక్టు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు రావాల్సిన పీఎఫ్ సొమ్ము కోసం ఎదురు చూస్తున్న కార్మికులు, సమస్యల పరిష్కారం కాక పోవడంతో మూడు రోజుల క్రితం పోరు బాట పట్టారు. సుమారు కోటి రూపాయల పీఎఫ్ సొమ్ము చెల్లించాల్సిన ఉన్నప్పటికీ ఇప్పటి వరకు చెల్లించడం లేదని కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- పారిశుధ్య విభాగంలో..
కాగజ్నగర్ మున్సిపాలిటీలోని పారిశుధ్య విభాగం లో 145 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తుం డగా, వీరికి రూ.14వేల ప్రతి నెల జీతం అందుతుంది. ఇందులో రూ.2వేలు ఈఎస్ఐ, పీఎఫ్ ప్రతి నెలా కారొరేషన్కు కార్మికుడి నుంచి జీతాల్లో కోత విధించి మిగితా డబ్బులను చెల్లిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ కట్ చేసి సొమ్మును నేరుగా పీఎఫ్, ఈఎస్ఐ కార్పొరేషన్లకు చెల్లించక పోవడంతో వీరికి పీఎఫ్ సొమ్ము జమ కావడం లేదు. ఈ విషయంలో గతంలో కూడా కాంట్రాక్టు కార్మికులు పోరు బాట పట్టారు. అలాగే వరంగల్ ఆర్జేడీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో గత రెండేళ్ల క్రితం కూడా ఈ విషయంలో ఆర్జేడీ విచారణ వచ్చి సమ్యలను కూడా తెలుసుకున్నారు. కాని ఇంత వరకు ఎలాంటి పీఎఫ్ సొమ్ములు చెల్లించక పోవడంతో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తమ వృత్తిలో ఎదో ఆపద వచ్చినప్పటికీ పీఎఫ్ సొమ్ము ఉందన్న కొండంత ఆశతో తాము విధులు చేస్తున్నా మని, ఇప్పుడు ఈ సొమ్ములేక పోవటంతో తమ పరిస్థితి ఎంటనీ అధికారులపై మండి పడుతున్నారు. మున్సిపాలిటీలో ఆస్తి పన్ను 3 కోట్ల మేర వసూలు చేస్తున్నప్పటికీ తమ పీఎఫ్ సొమ్ము ఎందుకు కట్టడం లేదని అంతా ప్రశ్నిస్తున్నారు. పోరాటాలు చేస్తున్నప్ప టికీ కూడా అధికారులు బూటకపు హామీలిస్తున్నారే తప్పా ఇంత వరకు ఎలాంటి పురోగతి లేదని చెబుతున్నారు.
- కచ్చితంగా చెల్లించాలని..
తమకు కచ్చితంగా పీఎఫ్ సొమ్ము చెల్లించాల్సిందే నని కాంట్రాక్టు కార్మికులు విధులు బహిష్కరించి మూడు రోజుల క్రితం సమ్మె బాట పట్టారు. వాస్తవంగా ఎస్పీఎం నుంచి గతంలో ఏటా రూ.1.20 కోట్ల మేర ఆస్తి పన్నును యాజమాన్యం కట్టేది. అయితే గత పాలక వర్గ హాయంతో మిల్లు పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఏటా రూ.50 లక్షలు కట్టేందుకు తీర్మానం చేయడంతో మున్సిపాల్టీపై ఇప్పుడు అధిక భారం అవుతోందని బీజేపీ కౌన్సిలర్లు చెబుతున్నారు. కాంట్రాక్టు కార్మికులకు భవిష్య నిధి ఎంతో అవసరం ఉంటుంది. కార్మికుల పిల్లల పెళ్లిల కోసం, విద్య కోసం ఎంతగానో ఉపయోగపడే అవకా శాలు ఉంటాయి. పలువురు అవసరం ఉందని పీఎఫ్ కార్యాలయంలో రుణం కోసం దరఖాస్తులు చేసుకోగా సొమ్ము లేదని దరఖాస్తులను తిరస్కరించినట్టు పలు వురు చెబుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమి షనర్ తిరుపతిని వివరణ కోరగా పీఎఫ్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.