Share News

kumaram bheem asifabad- తేలని ‘ఈఎస్‌ఐ’ సమస్య

ABN , Publish Date - Oct 29 , 2026 | 10:59 PM

కాగజ్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రి భవిత వ్యం సమస్య ఎటూ తేలడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఈ ఆసుపత్రి కాగజ్‌నగర్‌లో గత 50 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనం పూర్తిగా కూలి పోయేందుకు సిద్ధంగా ఉంది. వర్షా కాలంలో ఎప్పుడు స్లాబ్‌ పెచ్చులు రాలడం, వర్షం నీరు అంతా చేరి ప్రమాదకరంగా మారడంతో ఈ సమస్యపై గత రెండేళ్ల క్రితం ఈఈఎస్‌ఐ కార్పొరేషన్‌ సెంట్రల్‌ కమిటి సభ్యులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపారు.

kumaram bheem asifabad- తేలని ‘ఈఎస్‌ఐ’ సమస్య
కాగజ్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రి భవనం

కాగజ్‌నగర్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రి భవిత వ్యం సమస్య ఎటూ తేలడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఈ ఆసుపత్రి కాగజ్‌నగర్‌లో గత 50 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనం పూర్తిగా కూలి పోయేందుకు సిద్ధంగా ఉంది. వర్షా కాలంలో ఎప్పుడు స్లాబ్‌ పెచ్చులు రాలడం, వర్షం నీరు అంతా చేరి ప్రమాదకరంగా మారడంతో ఈ సమస్యపై గత రెండేళ్ల క్రితం ఈఈఎస్‌ఐ కార్పొరేషన్‌ సెంట్రల్‌ కమిటి సభ్యులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపారు. ఈ విచారణలో ప్రధానంగా ఈఎస్‌ఐ భవనాన్ని పూర్తిగా కూల్చివేయాల్సిన స్పష్టంగా సూచించారు. అప్పటి వరకు తాత్కాలికంగా ఇతర భవనంలోకి తరలించాలని చెబుతున్నారు. కాని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాక పోవడంతో ఇతర భవనంలోకి మార్చాలంటే ప్రభుత్వం నిర్ధేశించిన అద్దె తక్కువగా ఉండడం, ప్రయివేటులో ఎక్కువగా ఉండడంతో ఈ సమస్య తెగడం లేదు. అయితే ప్రభుత్వ భనంలోకి మార్చేదామంటే ఈ ఆసుపత్రిలోని వస్తువులు, పరికరాలు ఎక్కడ కూడా సరి పోవడం లేదు. వర్షాకాలంలో విధులు నిర్వహించాలంటే ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఉంది.

వాస్తవ పరిస్థితులపై..

ఇక్కడి అదికారులు కూడా వాస్తవ పరిస్థితులను ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ అధికారులకు కూడా లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. 25 ఎకరాలు ఈ ఆసుపత్రికి స్థలాన్ని కేటాయించారు. నూతన భవన నిర్మాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా ఇంత వరకు కొలిక్కి రావడం లేదు. కాగజ్‌నగర్‌ పారిశ్రామిక ప్రాంతం కావడంలో మిల్లులో పని చేసే కార్మికులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. అత్యవసమైతే నేరుగా కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించేందుకు సౌకర్యం ఉంటుంది. కానీ భవన సమస్య పరిష్కారం కాక పోవడం ఇప్పుడు అందరిలోనే ఆందోలన ఏర్పడింది. కేంద్రం స్పష్టమైన అనుమతిచ్చిన ప్పటికీ కూడా రాష్ట్ర నుంచి ఇంకా అనుమతి రాక పోవడంతో ఈ సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. ఈ ఆసుపత్రిలో పని చేస్తున్న ఉద్యోగులకు, సిబ్బందికి ప్రత్యేక క్వార్టర్లను కేటాయించారు. ఈఈఎస్‌ఐ కారక్పొరేషన్‌ సెంట్రల్‌ సిబ్బంది రెండేళ్ల క్రితం పరిశీలించగా క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయని గుర్తించారు. ఇందులో ఉండరాదని అందరికి నోటీసులను ఇచ్చి ఖాళీ చేయించారు. ఆసుపత్రి భవితవ్యంపై వెంటనే తేల్చాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయమై ఈఎస్‌ఐ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్‌ను వివరణ కోరగా సమస్యపై ఉన్నతాధికారులకు సమా చారం అందించామని చెప్పారు. ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదన్నారు. తదుపరి ఉత్తర్వులు రాగానే భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన వివరించారు.

Updated Date - Oct 29 , 2026 | 10:59 PM