Share News

kumaram bheem asifabad- అందని వేతనం

ABN , Publish Date - Mar 31 , 2026 | 10:34 PM

జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలు, గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర ్ల(సీఆర్టీ)కు వేతనాలు రాక వారి పరిస్థితి దయనీ యంగా మారింది. ప్రభుత్వ కొలువులు లేక ఈ ఉద్యోగంలో చేరిన వారికి నెలనెలా వేతనాలు అందక ఆర్థికంగా సతమతమవుతున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యా యులతో సమానంగా పని చేస్తున్నా తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన చెందుతున్నారు.

kumaram bheem asifabad- అందని వేతనం
లోగో

- కుటుంబాల పోషణకు ఇబ్బందులు

- ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినతి

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలు, గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర ్ల(సీఆర్టీ)కు వేతనాలు రాక వారి పరిస్థితి దయనీ యంగా మారింది. ప్రభుత్వ కొలువులు లేక ఈ ఉద్యోగంలో చేరిన వారికి నెలనెలా వేతనాలు అందక ఆర్థికంగా సతమతమవుతున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యా యులతో సమానంగా పని చేస్తున్నా తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన చెందుతున్నారు. దీంతో ఆర్థికంగా కుటుంబాలను పోషించుకోలేక అవమాన పడాల్సి వస్తోందని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 460 మంది సీఆర్టీల విద్యా బోధనలో కొనసాగుతున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ఆర్థికశాఖ 426 మంది సీఆర్టీల సేవల కొనసాగింపుకే అనుమతి ఇచ్చింది. 460 పోస్టులు మంజూరులో ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, పరిపాలన లోపం వల్ల ఈ దుస్థితి నెలకొందని సీఆర్టీలు ఆరోపిస్తున్నారు. దీంతో 34 మంంది సీఆర్టీల పరిస్థితి అయోమయంగా మారింది. వీరు విధులు నిర్వహిస్తున్నప్పటికీ గత ఏడాది ఏప్రిల్‌ నుంచి వేతనాలు నిలిచిపోయాయి. ఏడాది కాలంగా వేతనాలు లేక పోవడంతో కుటుంబ పోషణ తీవ్ర ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- సేవలకు తగిన ప్రతిఫలం లేక..

విద్యార్థులకు నిరంతరంగా బోధన కొనసాగిస్తున్న ప్పటికీ తమ సేవలకు తగిన ప్రతిఫలం లేకపోవడం అన్యాయమని వారు వాపోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపచడంలో సీఆర్‌టీల పాత్ర కీలకమని ఇలాంటి పరిస్థితులు విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని విద్యా వర్గాలు అభిప్రాయపడు తున్నాయి. కాగా మార్చితో ఆర్థిక సంవత్సరాంతం కావడంతో తమ సమస్యను అత్యవసరంగా పరిష్క రించాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా రు. తమ సేవలను అధికారికంగా కొనసాగించడంతో పాటు ఏప్రిల్‌ 2025 నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని బాధిత సీఆర్‌టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిలిచి పోయిన వేతనాలను తక్షణమే విడుదలకు గిరిజ న సంక్షేమ రాష్ట్ర స్థాయి అధికారులు చర్యలు తీసుకోవా లని సీఆర్‌టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శంకర్‌, విజేష్‌లు డిమాండ్‌ చేశారు. పరిపాలన లోపాలను సవరించి 34 మంది సీఆర్‌టీల వేతనాలు తక్షణమే విడుదల చేయాలని వారు కోరారు.

ఇబ్బందులు పడుతున్నాం..

- పర్చకి నాగు, సీఆర్టీ, ఎల్లూరు

ఏడాది కాలంగా వేతనాలు అందక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రాష్ట్ర స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్లె ఈ దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులు చొరవ చూపి సమస్య పరిష్కరించాలి. రెగ్యులర్‌ ఉపాధ్యాయులతో సమానంగా పని చేస్తున్నా మాపై ప్రభుత్వం కనికరం చూపడం లేదు.

వేతనాలు విడుదల చేయాలు..

ఎం శ్రీనివాస్‌, సీఆర్టీ, వాంకిడి

రాష్ట్రస్థాయి అధికారులు తక్షణమే నిలిచిపోయిన వేతనాలు విడుదలకు చర్యలు తీసుకోవాలి. వేతనా లు లేక కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఆరోగ్య అవసరాలకు అప్పులు చేయక తప్పడం లేదు. వెంటనే తమ వేతనాలను తమ ఖాతాలో పడే విధంగా గిరిజన సంక్షేమ, ట్రెజరీ అధికారులు చొరవ చూపాలి.

Updated Date - Mar 31 , 2026 | 10:34 PM