Share News

గవర్నర్‌తో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:52 AM

కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాతో భేటీ అయ్యారు. ఆదివారం లోక్‌భవన్‌లో కిషన్‌రెడ్డి..

గవర్నర్‌తో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాతో భేటీ అయ్యారు. ఆదివారం లోక్‌భవన్‌లో కిషన్‌రెడ్డి.. గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుక్లాకు కిషన్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, తెలంగాణలో 5008 అంగన్‌వాడీలను ‘సక్షం’లో భాగంగా ఆధునికీకరించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకు కేంద్రం రూ.30.04 కోట్లు కేటాయించినట్లు ఆదివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 948 కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Mar 16 , 2026 | 04:52 AM