Share News

సింగర్‌గా మారిన బండి సంజయ్‌

ABN , Publish Date - Mar 27 , 2026 | 04:17 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ గాయకుడి అవతారమెత్తారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)ను స్థాపించి శత వసంతాలు పూర్తయిన నేపథ్యంలో...

సింగర్‌గా మారిన బండి సంజయ్‌

  • ఆర్‌ఎస్‌ఎస్‌ గీతాలను ఆలపించిన కేంద్ర మంత్రి

  • సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ప్రోమో

హైదరాబాద్‌/కరీంనగర్‌ కల్చరల్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి బండి సంజయ్‌ గాయకుడి అవతారమెత్తారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)ను స్థాపించి శత వసంతాలు పూర్తయిన నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ గీతాలను ఆలపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసిన సంజయ్‌.. జాతీయవాదం, హిందుత్వ సిద్ధాంతాలను పూర్తిగా పుణికి పుచ్చుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను సామాన్య ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఆ సంస్థ గీతాలను ఆలపించారు. సంజయ్‌ పాడిన గీతాలకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల కాగా, సోషల్‌ మీడియాలో అది హల్‌చల్‌ చేస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ గీతాలను కరీంనగర్‌లో శుక్రవారం అధికారికంగా విడుదల చేయనున్నారు.

Updated Date - Mar 27 , 2026 | 04:17 AM