హెచ్‌సీఏ ఎంపికల్లో పైరవీలు : బండి సంజయ్
ABN , Publish Date - Mar 09 , 2026 | 03:44 AM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో పైరవీలు కొనసాగుతున్నాయని, డబ్బులు తీసుకొని ఎంపిక చేసే దుస్థితి నెలకొందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి...
భగత్‌నగర్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో పైరవీలు కొనసాగుతున్నాయని, డబ్బులు తీసుకొని ఎంపిక చేసే దుస్థితి నెలకొందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. క్రీడాకారుల ప్రతిభను దెబ్బతీసే ఈ దుర్మార్గానికి చరమగీతం పాడాలన్నారు. ఆదివారం కరీంనగర్‌లో నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభతో క్రీడల్లో రాణించే పరిస్థితి రాష్ట్రంలో లేకపోవడం బాధాకరమన్నారు. కేంద్రం రాబోయే దశాబ్దకాలానికి ఖేలో ఇండియా మిషన్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. ఇది ప్రతిభావృద్ధికి మార్గంచూపడంతోపాటు కోచ్‌లు, సహాయక సిబ్బంది వ్యక్తిగత అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు.