కోతల్లేకుండా విద్యుత్ సరఫరా
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:19 PM
వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామని జిల్లా విద్యుత్ శాఖ అధికారి నరసింహారెడ్డి అన్నారు.
- విద్యుత్‌శాఖ జిల్లా అధికారి నరసింహారెడ్డి
ఉప్పునుంతల, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామని జిల్లా విద్యుత్ శాఖ అధికారి నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన ఉప్పునుంతలతో పాటు మండల పరిధిలోని మొల్గర, దాసర్లపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించి గ్రామాల్లో విద్యుత్ సమస్యల గురించి ప్రజలు, రైతులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. విద్యుత్ అధికారులకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన వెంట అచ్చంపేట ఏడీ ఆంజనేయులు, ఏఈ కొండల్, సర్పంచ్‌లు శ్రీనివాసులు, రమేష్‌రెడ్డి, నాయకులు సుమన్ తదితరులు ఉన్నారు.