kumaram bheem asifabad- అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
ABN , Publish Date - Jan 22 , 2026 | 10:35 PM
ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఎలాంటి అంతాయం లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జిల్లాలోని లింగాపూర్ మండల కేంద్రం, కెరమెరి ధనోరా, ఆసిఫాబాద్ మండలం వావుదాం, చింతలమానేపల్లి మండలం గూడెం, జిల్లా కేంద్రంలో సబ్ స్టేషన్లు, విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం నిర్మాణాలకు సంబంధించి గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్‌బాబు, కోవ లక్ష్మి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, జీసీసీ చైర్మన్ తిరుపతి, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డేవిడ్, జిల్లా అటవీ శాఖాధికారి నీరజ్‌కుమారతో కలిసి ఆవిష్కరించారు.
ఆసిఫాబాద్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఎలాంటి అంతాయం లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జిల్లాలోని లింగాపూర్ మండల కేంద్రం, కెరమెరి ధనోరా, ఆసిఫాబాద్ మండలం వావుదాం, చింతలమానేపల్లి మండలం గూడెం, జిల్లా కేంద్రంలో సబ్ స్టేషన్లు, విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం నిర్మాణాలకు సంబంధించి గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్‌బాబు, కోవ లక్ష్మి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, జీసీసీ చైర్మన్ తిరుపతి, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డేవిడ్, జిల్లా అటవీ శాఖాధికారి నీరజ్‌కుమారతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టి అదికార యంత్రాంగం సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేస్తుందని అన్నారు. జిల్లాలో లింగాపూర్ మండల కేంద్రంలో రూ.3.99 కోట్లతో 33/11 విద్యుత్ ఉప కేంద్రం, కెరమెరి మండలం ధనోరాలో రూ.2.30కోట్లతో 33/11 విద్యుత్ ఉప కేంద్రం, ఆసిఫాబాద్ మండలం వావుదాంలో రూ.2.64కోట్లతో 33/11 విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. చింతల మానేపల్లి మండలం గూడెంలో రూ.2.32 కోట్లతో 33/11 విద్యుత ఉప కేంద్రం, జిల్లా కేంద్రంలో రూ.కోటితో విద్యుత్ సబ్‌స్టార్, రూ.1.70 కోట్లతో సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సఫారీ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో 495 స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.23.47 కోట్ల రుణం చెక్కును అందజేశారు. జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన మిల్లెట్ మోవా లడ్డు స్టాలను పరిశీలించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, నాయకులు శ్యాంనాయక్, విశ్వప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మంగ, తదితరులు పాల్గొన్నారు.