నిరంతరాయంగా తాగునీటిని అందించాలి
ABN , Publish Date - Aug 28 , 2026 | 10:28 PM
ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని అ మృత్ 2.0 పథకం కింద కొనసాగుతున్న నీటి ట్యాంక్ నిర్మాణ పను లను పరిశీలించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూరు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని అ మృత్ 2.0 పథకం కింద కొనసాగుతున్న నీటి ట్యాంక్ నిర్మాణ పను లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రతి నిత్యం తాగునీటిని అందించేందుకు నీటి ట్యాంకు, పైపులైన్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కొనసాగుతున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రహారీ గోడ , ఆసుపత్రిలోని పనులను పరిశీలించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. చెన్నూరులోని గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న అదనపు తరగి గదుల పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేయాలన్నారు. వంట శాలను పరిశీలించి ఆహారం తయారీ సమయంలో శుభ్రత పాటించాలని, విద్యార్థులకు మెను ప్రకారం సకాలంలో పౌష్ఠికాహారం, శుద్దమైన తాగునీటిని అందించాలని సూచించారు. ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులను జారీ చేయాలని ఆదేశించారు. మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్‌తో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, రీసర్వే నిర్వహణ తీరును పరిశీలించారు. భూబారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.