kumaram bheem asifabad-పట్టని గోడు
ABN , Publish Date - Oct 25 , 2026 | 10:17 PM
గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు చాలీచాలని వేతనాలతో దుర్భర జీవనం గడుపుతున్నా వారి గోడు పట్టించుకునే వారు కరువయ్యారు. ఉద్యోగ భద్రత కల్పించి పెన్షన్, బీమా సౌకర్యం కల్పించాలని ఏళ్లుగా పాలకులకు విజ్ఞపి చేస్తున్నా.. అమలుకు నోచుకోవడం లేదు. జిల్లాలోని 335 పంచాయతీల పరిధిలో 1,160 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు.
- చాలీచాలని వేతనాలు.. కుటుంబ పోషణ భారం
జైనూర్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు చాలీచాలని వేతనాలతో దుర్భర జీవనం గడుపుతున్నా వారి గోడు పట్టించుకునే వారు కరువయ్యారు. ఉద్యోగ భద్రత కల్పించి పెన్షన్, బీమా సౌకర్యం కల్పించాలని ఏళ్లుగా పాలకులకు విజ్ఞపి చేస్తున్నా.. అమలుకు నోచుకోవడం లేదు. జిల్లాలోని 335 పంచాయతీల పరిధిలో 1,160 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానాల్లో ఈ విధుల్లో చేరడానికి కొత్తవారు విముఖత వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో మురుగు కాలువలను శుభ్ర చేయడం, వీధుల్లో చెత్తను తొలగించడంతో పాటు అధికారుల ఆదేశాల మేరకు వివిధ పనులను కార్మికులు చేస్తున్నారు. పలువురు తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. కొందరు విధి నిర్వాహణలో అనారోగ్యానికి గురై మృతి చెందినా ప్రభుత్వ పరంగా సంబంధిత కుటుంబాలకు ప్రయో జనాలు కలిపించడం లేదు. గతంలో కార్మికులకు పంచాయతీ నిధుల నుంచే వేతనాలు చెల్లించేవారు. కొన్ని గ్రామాల్లో నెలల తరబడి చెల్లించకుండా జాప్యం చేసేవారు. దాదాపు ఆరేళ్ల నుంచి ఒక్కొక్కరికీ నెలకు 9,500 చొప్పున చెల్లిస్తున్నారు. ప్రతి నెలా రూ. 16 వేల వేతనం చెల్లించాలన్న ప్రతి పాధనలు అవలుకు నోచుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల బీమా పథకంలో చేరడానికి ఏటా పోస్టాఫీసులో రూ. 500 ప్రీమియం చెల్లిస్తున్నట్లు కార్మికులు చెబుతున్నారు.
సరిపడా సిబ్బంది లేక..
జిల్లాలోని గ్రామ పంచాయతీలలో అవసరాలకు సరిపడా సిబ్బంది లేరు. ప్రస్తుతం ఉన్న వారిలో చాల మంది మహిళలు, వృఽధ్ధులే ఉన్నారు. కొన్న అత్యవసర సమయాల్లో కార్యదర్శులు దిన సరి కూలీలను నియమించి పనులు చేయిస్తుంటారు. ఈ నెల 26న సీఐటీయూ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రామాన్ని చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేయనున్నట్లు నాయకులు తెలిపారు. పంచాయతీ సిబ్బందిని పీఆర్సీలో గుర్తించాలని మల్టీపర్పస్ వర్కర్ పని విధానం రద్దు చేసి పాత కేటగిరీలను కొనసాగంచే తదితర డిమాండ్లు అమలు చేయాలని కోరుతున్నారు.
రూ. 30 వేలు చెల్లించాలి..
రాజేందర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయడంతో పాటు కనీసం రూ. 30 వేలు వేతనం చెల్లించాలన్న డిమాండ్‌తో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రభుత్వం పంచాయతీ కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమస్యలు పరిష్కరించాలి.