kumaram bheem asifabad- అసంపూర్తి పనులు.. ఎన్నాళ్లీ అవస్థలు
ABN , Publish Date - Jan 27 , 2026 | 10:54 PM
అసంపూర్తిగా ఉన్న రోడ్లపై వాహనదారులకు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభు త్వం రూ.కోట్లు వెచ్చించి రోడ్లు మంజూరు చేసింది. బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితి బిన్నంగా ఉంటోంది.
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
బెజ్జూరు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): అసంపూర్తిగా ఉన్న రోడ్లపై వాహనదారులకు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభు త్వం రూ.కోట్లు వెచ్చించి రోడ్లు మంజూరు చేసింది. బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితి బిన్నంగా ఉంటోంది. కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయకపోగా బిల్లులు రావడం లేదనే కారణంతో పనులు అర్ధాంతరంగా నిలిపివేశారు.
ఇదీ పరిస్థితి..
సిర్పూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధు లు మంజూరు చేసింది. అయితే ఆయా గ్రామాల్లో సంబంధిత కాంట్రాక్టర్లు రోడ్లపై కంకర పోసి అర్దంతరంగా పనులు నిలిపివేయడంతో గ్రామీణ ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. సిర్పూర్(టి) మండలంలోని డౌనల్ ఏరియా, రైల్వే స్టేషన్ వరకు 1.1కిలోమీటర్, బెజ్జూరు మండలంలోని కొత్తగూడ నుంచి రెబ్బెన ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు 2.4కిలోమీటర్ వరకు రూ.8.11కోట్లు, చింతలమానేపల్లి మండలంలోని బాబాసాగర్ నుంచి కొత్తగూడ వరకు 3.5 కిలోమీటర్ల వరకు రూ.3 కోట్లు నిధులు మంజూరు చేయగా, ప్రస్తు తం రోడ్ల పనులు అర్దంతరంగా నిలిపి వేయడంతో ప్రయాణీకులు అవస్థలు పడుతు న్నారు.
- బిల్లులు అందని కారణంగానే..
ఆయా గ్రామాల్లో రోడ్ల నిర్మాణాల కోసం ప్రభు త్వం నిధులు మంజూరు చేయగా అట్టి పనుల్లో కేవలం రోడ్లపై కంకర పోసి వదిలివేశారు. దీంతో ఆయా గ్రామాల్లో వెళ్లే ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆయా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు విడుదల చేయని కారణంగానే పనులు పూర్తి చేయ లేదని తెలుస్తోంది. సంబంధిత అధికారులను సంప్ర దించగా ఆయా గ్రామాల్లో చేపట్టే రోడ్లకు బిల్లులు చెల్లించని కారణంగానే రోడ్లు వేయడం లేదని అంటున్నారు. త్వరలోనే రోడ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు చెబుతు న్నారు.
రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు..
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): సిర్పూర్(టి) మం డల కేంద్రంలోని బస్టాండు నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే రోడ్డు నిర్మాణ పనులను సదరు కాంట్రాక్టర్ బిల్లులు రాక మధ్య లోనే నిలిపి వేశారు. ఈ రోడ్డు మీదుగా నిత్యం ప్రజలు రైల్వే స్టేషన్, పాఠశాలలకు రాకపోకలు సాగిస్తుంటారు. మహారాష్ట్రకు నిత్యం వందల సంఖ్యలో లారీలు, ద్విచక్ర వాహనాలు వెళు తుంటాయి. రోడ్డు పూర్తి కాకపోవడంతో వాహనాల రాకపోకలకు కంకర లేచిపోయింది. బైక్‌పై వెళ్తున్న వారు కంకర రాళ్ల వల్ల అదుపుతప్పి పడిపోవడంతో గాయాలవు తున్నాయి.. ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు సైతం ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పటికైనా సంబంఽ దిత శాఖ అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తయ్యేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.