Share News

kumaram bheem asifabad- ఖరీఫ్‌కు ప్రతికూలమే..

ABN , Publish Date - Jul 15 , 2026 | 10:33 PM

వర్షాకాలం సీజన్‌ ప్రారంభమై 45రోజులు గడిచి పోయినా జిల్లాలో లోటు వర్షపాతమే కనిపిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ మొత్తం వర్షాభావంతో ప్రతికూల వాతావరణం ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జూలైలో రెండు వారాలు ముగిసినా వేసవి తీవ్రత తగ్గ లేదు. ఆకాశంలో మబ్బులు పట్టి అంతలోనే మాయమవుతున్నాయి. అక్కడక్కడా కొద్దిపాటి జల్లులు తప్ప భూములు పదునయ్యే స్థాయిలో వర్షం కురవడం లేదు. పైగా వేడిగాలులు వీస్తున్నాయి. మే నెలలో మేఘం మురిపించింది.

kumaram bheem asifabad- ఖరీఫ్‌కు ప్రతికూలమే..
లోగో

- తొమ్మిది మండల్లాలో లోటు వర్షపాతం

- వెలవెలబోతున్న చెరువులు

- ఆందోళనలో అన్నదాతలు

ఆసిఫాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం సీజన్‌ ప్రారంభమై 45రోజులు గడిచి పోయినా జిల్లాలో లోటు వర్షపాతమే కనిపిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ మొత్తం వర్షాభావంతో ప్రతికూల వాతావరణం ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జూలైలో రెండు వారాలు ముగిసినా వేసవి తీవ్రత తగ్గ లేదు. ఆకాశంలో మబ్బులు పట్టి అంతలోనే మాయమవుతున్నాయి. అక్కడక్కడా కొద్దిపాటి జల్లులు తప్ప భూములు పదునయ్యే స్థాయిలో వర్షం కురవడం లేదు. పైగా వేడిగాలులు వీస్తున్నాయి. మే నెలలో మేఘం మురిపించింది. దీంతో ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని రైతులు భావించారు. ఖరీఫ్‌ మొదట్లో కురిసిన చినుకులకు కొందరు విత్తనాలు విత్తారు. తర్వాత చినుకు జాడ కరవైంది. పొలాలు తడారిపోయాయి. ఆరు వారాలైనా వర్షం పడకపో వడం.. నేలలో తేమ లేకపోవడంతో విత్తనం మొలకెత్తని పరిస్థితి నెలకొంది. జిల్లాలో జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు 355.9 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదు కావల్సి ఉంది. కానీ 262.8 మిల్లీమీ టర్ల వర్షం కురిసింది. ఈ నెలలో కూడా సాధార ణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకా శం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటన విడుదల చేయడంతో అన్నదాతలు ఆందో ళన చెందుతున్నారు. దీన్నిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎల్‌నినో ప్రభావం జి ల్లాపై స్పష్టంగా కనిపిస్తుండడంతో ప్రత్యామ్నా యంపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లాలో 15 మండలాలకు గాను ఇప్పటివరకు 9 మండలాలలో లోటు వర్షపాతం నమోదు కాగా మిగితా 6 మండలాలల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇందులో బెజ్జూరు మండలంలో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే జైనూర్‌, లింగాపూర్‌, రెబ్బెన, ఆసిప ాబాద్‌, వాంకిడి, కాగజ్‌నగర్‌, పెంచికలపేట, దహె గాం మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. కాగా బెజ్జూరు మండలంలో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. సిర్పూర్‌(యు), తిర్యాణి, సిర్పూర్‌(టి), కౌటాల, చింతలమానేపల్లి, కెరమెరి, మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కావడంతో అన్నదా తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా వానాకా లం సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి భారీ వర్షాలు కురువక పోవడంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్గుల్లో అంతంత మాత్రంగానే నీటినిల్వలు కనిపిస్తున్నాయి. కుమరంభీం ప్రాజెక్టు పూర్తి స్థా యి నీటి మట్టం 243.00 మీటర్లు కాగా, ప్రస్తుతం 235.90 మీటర్లకు చేరుకుంది. వట్టివాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 239.500 మీటర్లు కాగా, ప్రస్తుతం 235.650 మీటర్లకు చేరుకుంది.అలాగే చెరువులు,కుంటల్లో నీటి నిల్వలు లేక వెలవెలబో తున్నాయి. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

- 4,52,202 ఎకరాల్లో పంటల సాగు అంచనా..

జిల్లాలోని 15 మండలాలలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 4,52,202 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవు తాయని అంచనాలు వేశారు .అయితే వీటిలో పత్తి 3,70,919 ఎకరాలు, వరి పంట 42,228 ఎకరాలు, కంది పంట 20,817, సోయీబీన్‌ పంట 1,326 ఎకరాలు, మొక్కజొన్న 668 ఎకరాల్లో అలాగే ఇతర పంటలైన జొన్న, పెసర, మినుములు, మిరప, వేరుశెనగ, అముదాలు, నువ్వులు 11,254 ఎకరాల లో సాగవుతున్నట్లు అంచనాలు రూపొందించారు. కాగా జిల్లాలో ఎక్కువగా రైతులు వానాకాలం సీజన్‌లో వర్షాధార పంటలనే సాగు చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో లోటు వర్షపాతం నమోదు కావ డంతో పత్తి సాగు సవాలుగా మారింది. వరి పంట సాగుకు కనీస నీటి నిల్వలు లేకపోవడంతో ఆయకట్టుదారుల్లో అందోళన వ్యక్తమవుతోంది.

ఆరుతడి పంటలు సాగు చేయాలి..

కె హరిత, కుమరం భీం జిల్లా కలెక్టర్‌

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షభావ పరిస్థితు లు నెలకొన్న నేపథ్యంలో రైతులు వరిసాగుపై అధార పడకుండా తక్కువ నీటి అవశ్యకత గల ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి. జిల్లాలో చెరువులు, కుంటలు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండకపో వడం భూగర్బ జలాలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దీం తో చెరువులు, కాలువలు, బోరుబావుల ఆధారంగా సాగుచేసే వరిపంట విస్తీర్ణంపై ప్రభావం పడ నుంది. ఈనెల 31 వరకు కూడా వర్షభావ పరిస్థి తులు కొనసాగితే ఆగస్టు మొదటి వారంలో కందు లు, ఉల్వలు, అలసందలు, ఆముదం, నువ్వు లు, జొన్నలు, సజ్జలు, పప్పు ధాన్యాలు, చిరుధా న్యాల విత్తనాలు విత్తుకొవడం రైతులకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మండల వ్యవసాయ అధికారులను రైతులు సంప్రదించి వారి సూచనల మేరకు పంటలు సాగుచేసి లబ్ధి పొందాలి.

Updated Date - Jul 15 , 2026 | 10:33 PM