మట్టి నమూనా సేకరణపై అవగాహన
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:18 PM
పట్టణం లోని ప్రభుత్వ బాలుర పాఠ శాల విద్యార్థులకు వ్యవసా యం దాని ప్రాముఖ్యత, మ ట్టి నమునాలపై వ్యవసా య అధికారులు అవగాహన కల్పించారు.
అచ్చంపేటటౌన్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : పట్టణం లోని ప్రభుత్వ బాలుర పాఠ శాల విద్యార్థులకు వ్యవసా యం దాని ప్రాముఖ్యత, మ ట్టి నమునాలపై వ్యవసా య అధికారులు అవగాహన కల్పించారు. మట్టి నమునా తీసే విధానంలో భాగంగా ఒక రైతు పొలంలో 8 నుంచి 10 శ్యాంపిల్స్‌ను ఎలా తీయా లి, అలా తీసిన మొత్తం శ్యాంపిళ్లను కలిపి నా లుగు భాగాలుగా విభజించి వాటిని ల్యాబ్ పం పించాల్సిన విధానంపై ఏవో కృష్ణయ్యతో కలిసి ఏడీఏ చంద్రశేఖర్ వివరించారు. ప్లాస్టిక్ కవర్ లో మట్టి శ్యాంపిల్ తీసేటప్పుడు ఏ రైతు పొ లంలో శ్యాంపిల్ తీశారో వారి పేరురాసి ల్యాబ్ కు పంపిచాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపా ధ్యాయుడు గోపాల్, వ్యవసాయ అధికారులు నరేష్, లక్ష్మణ్ సింగ్, ఉపాధ్యాయులు, విద్యార్థు లు పాల్గొన్నారు.
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు
వెల్దండ, (ఆంధ్రజ్యోతి) : ఆధునిక పద్ధతులు పాటించి సాగుచేస్తే అధిక దిగుబడులు సాధ్యమని ఏవో శోభారాణి అన్నారు. బుధవారం మండల పరిధిలోని గుండాల ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థులకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నేల స్వభావం, మట్టి నమూనా తదితర అంశాలపై ఆమె అవగాహన కల్పించారు. పంటల సాగుకు నేల స్వభావం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రిన్సిపాల్ నమన్‌కుమార్, వైస్‌ప్రిన్సిపాల్ బాస్కర్, ఏఈవోలు ఉన్నారు.