Share News

kumaram bheem asifabad- అమ్మో పిడుగు

ABN , Publish Date - Jun 02 , 2026 | 10:55 PM

ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులతో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు పిడుగు బారిన పడి చనిపోతున్నారు. కొన్నేళ్ల క్రితం మండలంలోని కనర్‌గాం, లంజన్‌వీర, ఇంధాని, సరండి, చౌపన్‌గుడతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై అనేక మంది మృతి చెందగా ఆదివారం రోజున రెబ్బెన మండలం ఖైరిగుడ గ్రామ పంచాయతీ పరిధిలో భార్యభర్తలు ఇద ్దరు, ఆసిఫాబాద్‌ మండలంలోని కౌటగుడ గ్రామానికి చెందిన ఒకరు పిడిగుపడి చనిపోయారు. వర్షాకాలంలో ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తే పిడుగుపాటు నుంచి రక్షించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

kumaram bheem asifabad- అమ్మో పిడుగు
లోగో

- స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న అధికారులు

వాంకిడి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులతో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు పిడుగు బారిన పడి చనిపోతున్నారు. కొన్నేళ్ల క్రితం మండలంలోని కనర్‌గాం, లంజన్‌వీర, ఇంధాని, సరండి, చౌపన్‌గుడతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై అనేక మంది మృతి చెందగా ఆదివారం రోజున రెబ్బెన మండలం ఖైరిగుడ గ్రామ పంచాయతీ పరిధిలో భార్యభర్తలు ఇద ్దరు, ఆసిఫాబాద్‌ మండలంలోని కౌటగుడ గ్రామానికి చెందిన ఒకరు పిడిగుపడి చనిపోయారు. వర్షాకాలంలో ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తే పిడుగుపాటు నుంచి రక్షించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

- ఎలా సంభవిస్తుంది ?

మేఘాల నుంచి భూ ఉపరితలాన్ని తాకే శక్తిమంతమైన ప్రవాహం పిడుగు. వాతా వరణం చల్లబడినప్పుడు మేఘాలలో ద్రవ, ఘణ పదార్థాలు ఉత్పన్నమవుతాయి. వీటికి బలమైన గాలి తోడైనప్పడు నీరు, మంచు బిందువులు మధ్య రాపిడి ఏర్పడుతుంది. ఫలితంగా మేఘాలలో కొన్ని వేల కోట్ల పాజిటివ్‌, నెగటివ్‌ చార్జీలు ఏర్పడతాయి. ఇవి ఒక దానికోకటి ఆకర్షించుకున్నప్పుడు అమితమైన విద్యుచ్చక్తి, వేడి పుడుతుంది. ఒక పిడుగు సుమారు 30 కోట్ల వోల్టుల విద్యుత్తు శక్తిని కలిగి ఉంటుంది. పిడుగులు చుట్టూ ఉన్న గాలిని రెప్పపాటులో వేడెక్కించి భయంకరమైన శబ్దన్ని సృష్టిస్తాయి. వర్షం కురిసే సమయంలో కేవలం మేఘాలలోనే కాదు నేలపై ఉండే ఎత్తైన ప్రదేశాలు, చెట్లు, లోహాలవంటి వాటిపై కూడా పిడుగులు పడుతుంటాయి. ఎత్తేన చెట్లు, అపార్టుమెంట్లు, విశాలమైదానాలు, భవణాలు, డాబాలు, కరెంటు స్థంబాలు వంటి లోహాలు పిడుగును ఆకర్షిస్తుంటాయి. పిడుగుపాటుకుగురై గాయపడిన వాళ్లు తర్వాత జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, పక్షవాతం వంటి శారీరక సమ్యలకు గురవుతున్నారు.

- ఇవి చేయకూడదు

ఫ వర్షం పడుతున్న సమయంలో ఎత్తయిన చెట్లు, సెల్‌టవర్లు, స్తంభాలు, కొండల వద్దకు వెళ్లకూడదు. విద్యుత్తు నియంత్రికలకు దూరంగా ఉండాలి.

ఫ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌ సిస్టమ్‌లు, విద్యుత్తు స్టవ్‌లు, ఇతర విద్యుత్తు పరికరాలు ఉపయోగించవద్దు. వర్షం కురిసినప్పుడు విద్యుత్తు సరఫరా హెచ్చుతగ్గుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఫ పొలాల్లొ పని చేయడం, పశువులను మేపడం, చేపలు పట్టడం వంటివి చేయోద్దు. ప్రయాణాలు చేయకపోవడం మంచిది. చెరువుకుంటలు, ఈత కొలనులు వంటి బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలి.

ఫ తలదాచుకునేందుకు ఆశ్రయం లేనప్పుడు తనకు తానుగా మోకాళ్లపై చేతులు, తల పెట్టి దగ్గరగా బంతిలా ముడుచుకొని కూర్చోవాలి. దీని వల్ల విద్యుత్తు ప్రవాహం ముప్పు తక్కువగా ఉంటుంది. చెవులు మూసుకోవడం ద్వారా తరంగాలు లోపలికి వెళ్లకుండా చూసుకోవచ్చు.

ఫ భూమిపై అరికాళ్లు పూర్తిగా ఆనించకుండా వెళ్లపై నిలుచోవాలి. నీటిలో ఉంటే సాధ్యమైనంత వరకు తొందరగా బయటకు రావాలి.

ఫ ఆటవి ప్రాంతంలో ఉంటే మరుగుజ్జు, చిన్న చెట్ల కింద ఆశ్రయం పొందాలి.

- ఇంటికి ఎర్తింగ్‌ తప్పనిసరి..

పిడుగుపడే వాతావరణం ఉందన్నప్పుడు ఇంట్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయాలి. ఆ సమయంలో ఓల్టేజీ వచ్చి విద్యుత్తు ఉపకరకణాలు డెబ్బతింటాయి. నివారణకు తప్పనిసరి ప్రతి ఇంటికి ఎర్తింగ్‌ చేయించాలి. ఫ్యూజులకు సరైన రేటింగ్‌ కలిగిన తీగను ఉపయోగించాలి. విద్యుత్తు బోర్డు నుంచి ప్లగ్‌ను తొలగిస్తే పూర్తి రక్షణగా ఉంటుంది.

- ఇవి చేయకూడదు...

ఫ గుంపులుగా కాకుండా దూరంగా ఉండాలి. ఉరుములు, మెరుపుల సమయంలో స్నానాలు చేయడం, పాత్రలు కడగటం వంటివి చేయరాదు. ఇనుప కడ్డీలు ఉన్న గొడుగులు వాడరాదు.

- పరిహారం...

ఫ 2015లో విడుదల చేసిన జీవో నంబరు 2 ప్రకారం పిడుగు పాటుకు గురై మనిషి మృతి చెందితే రూ. 6 లక్షలు, పశువులు మృతి చెందితే రూ. 30 వేలు ఎక్స్‌గ్రేషియా (పరిహారం) ఇవ్వాలి.

- జాగ్రత్తలే రక్ష..

వినయ్‌, వైద్యాధికారి

ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో ఎవరికి వారు స్వీయజాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఆ సమయంలో చాలామంది బయట తిరగుతుంటారు. పొలాల్లో ఎత్తైన చెట్ల కింద తలదాచు కోవద్దు, వస్తువులకు భద్రత ముఖ్యం. పిడుగుపాటుకు గురైతే తక్షణం ఆస్పత్రికి తరలించాలి.

Updated Date - Jun 02 , 2026 | 10:55 PM