Share News

kumaram bheem asifabad-నిరక్షరాస్యులకు ‘ఉల్లాస్‌’

ABN , Publish Date - Apr 19 , 2026 | 11:05 PM

మహిళలు అక్ష్యరాస్యులుగా ఉంటే కుటుంబం, సమాజం బాగు పడుతుంది. ఇందుకు గాను ప్రభుత్వం మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులైన మహిళలను సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా విద్యాశాఖ, సెర్ప్‌ అధికారుల సమన్వయంతో ఉల్లాస్‌ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించారు. అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండర్‌ స్టాండింగ్‌ లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ (ఉల్లాస్‌) పథకాన్ని అమలులోకి తీసుకొచ్చాయి.

kumaram bheem asifabad-నిరక్షరాస్యులకు ‘ఉల్లాస్‌’
మహిళలకు పరీక్ష నిర్వహిస్తున్న అధికారులు(ఫైల్‌)

- జిల్లాలో 23,170 చదువురాని మహిళల గుర్తింపు

ఆసిఫాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): మహిళలు అక్ష్యరాస్యులుగా ఉంటే కుటుంబం, సమాజం బాగు పడుతుంది. ఇందుకు గాను ప్రభుత్వం మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులైన మహిళలను సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా విద్యాశాఖ, సెర్ప్‌ అధికారుల సమన్వయంతో ఉల్లాస్‌ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించారు. అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండర్‌ స్టాండింగ్‌ లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ (ఉల్లాస్‌) పథకాన్ని అమలులోకి తీసుకొచ్చాయి. ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేసేలా జిల్లా ఉన్నతాధికారులు ప్రణాళికతో ముందుకెళుతున్నారు. ప్రతి ఒక్కరూ కనీసం చదవడం, రాయడం రావా లన్న ఉద్ధేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఉల్లాస్‌ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 15 ఏళ్లు పైబడిన, 50 ఏళ్లలోపు నిరక్షరాస్యులు, చదువుకోడానికి అవకాశంలేని వారికి అక్షరాలు నేర్పి జీవన నైపుణ్యాలు, సామాజిక అవగా హన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని వయోజన విద్య ద్వారా చేపట్టారు. గ్రామాల్లో చదువుకున్న మహిళ సంఘాల సభ్యులు చదువురాని తోటి మహిళలకు సమయం ఉన్నపుడు అక్షర జ్ఞానం నేర్పించాల్సి ఉంటుంది. జిల్లాలో ఈ కార్యక్రమం ద్వారా 23,170 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలని వయోజన విద్యాశాఖ లక్ష్యం పెట్టుకుంది.

- 11,903 మందికి శిక్షణ

జిల్లాలో 23,170 మంది నిరక్షరాస్యులు ఉండగా ఉల్లాస్‌ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 11,903 మహిళలకు మహిళా సంఘాల ద్వారా చదవడం, రాయడం, అంకెలను గుర్తించడం నేర్పించారు. 100 రోజుల పాటు 15 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ తీసుకున్న మహిళలకు గత నెల 29న పరీక్ష నిర్వహించారు. వంద శాతం మహిళలు ఈ పరీక్షల రాశాలు. జవాబు పత్రాల ముల్యాం కనం చివరి దశలో ఉంది ఫలితాలు ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో విడత కార్యక్రమాన్ని వచ్చే ఆగస్టు, సెప్టెంబరు నెలలో నిర్వహించనున్నారు.

15 నుంచి 50 ఏళ్లలోపు..

- శ్రీనివాస్‌, ప్రాజెక్టు అధికారి, వయోజనవిద్య

జిల్లాలో 15 నుంచి 50 ఏళ్లలోపు 23,170 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించాం. వారంతా చదువుకునేలా ఉల్లాస్‌ యాప్‌ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. ఇందులో కొంత మందికి డీఆర్‌డీఏ సహకారంతో మహిళ సంఘాల్లో చదువుకున్న మహిళలతో 100 రోజుల పాటు చదవడం, రాయడం నేర్పించాం. వారికి గత నెలలో పరీక్ష నిర్వహించాం. ఈ పరీక్ష పాస్‌ అయిన వారు ఓపెన్‌ పరి పరీక్ష రాసే అవకాశం ఉంది.

Updated Date - Apr 19 , 2026 | 11:05 PM