Share News

అంతర్జాతీయ వేదికపై తెలుగు సాంస్కృతిక వైభవం

ABN , Publish Date - May 16 , 2026 | 04:33 AM

యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో నివసించే తెలుగువారికి తెలుగు సాంస్కృతిక వైభవాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించే అవకాశం దక్కనుంది.

అంతర్జాతీయ వేదికపై తెలుగు సాంస్కృతిక  వైభవం

  • జూలైలో లండన్‌లో యూకే తెలుగు పేజెంట్‌ ఫ్యాషన్‌ షో

హైదరాబాద్‌ సిటీ, మే 15(ఆంధ్రజ్యోతి): యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో నివసించే తెలుగువారికి తెలుగు సాంస్కృతిక వైభవాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించే అవకాశం దక్కనుంది. ప్రత్యేకంగా రూపొందించిన తొలి నాన్‌-కన్వెన్షనల్‌ తెలుగు పేజెంట్‌గా యూకే తెలుగు పేజెంట్‌ 2026 చరిత్ర సృష్టించనుంది. కార్యక్రమ గ్రాండ్‌ ఫినాలే లండన్‌లో 2026 జూలై 11, 12 తేదీలలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం దుర్గం చెరువు సమీపంలోని ఎకాన్‌ పబ్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో నటుడు జయంత్‌, మిస్‌ యూనివర్స్‌ తెలంగాణ కాశ్వీ, దేశీ ఈవెంట్స్‌ ఫౌండర్‌ ప్రీతి, కాస్మోటాలజిస్ట్‌ డాక్టర్‌ ప్రీతి అడుసుమల్లి, సర్టిఫైడ్‌ ఇమేజ్‌ కన్సల్టెంట్‌, అనుగ్న తదితరులు పాల్గొన్నారు. సంప్రదాయ బ్యూటీ పేజెంట్లకు భిన్నంగా యూకే తెలుగు పేజెంట్‌ 2026ను నిర్వహిస్తున్నామని ప్రీతి తెలిపారు. మిస్టర్‌, మిస్‌, మిస్సెస్‌, టీనేజర్స్‌ పిల్లలు వంటి విభాగాలలో పోటీ ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. చివరి తేదీ 2026 మే 30. ఆసక్తిగల వారు ఠీఠీఠీ.్ట్ఛజూఠజఠజుజీుఽజట్ఞఠ్ఛ్ఛుఽట.ఛిౌ.ఠజు వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

Updated Date - May 16 , 2026 | 04:33 AM