Share News

5-17 ఏళ్ల వారికి ఆధార్‌ సవరణ ఉచితం

ABN , Publish Date - May 21 , 2026 | 03:33 AM

ఐదేళ్ల నుంచి 17 ఏళ్ల వయసు కలిగినవారు మొదటిసారి తమ ఆధార్‌కార్డులో వివరాలను ఆధార్‌ నమోదు కేంద్రాల్లో సవరణ చేసుకుంటే ...

5-17 ఏళ్ల వారికి ఆధార్‌ సవరణ ఉచితం

హైదరాబాద్‌ సిటీ, మే 20 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల నుంచి 17 ఏళ్ల వయసు కలిగినవారు మొదటిసారి తమ ఆధార్‌కార్డులో వివరాలను ఆధార్‌ నమోదు కేంద్రాల్లో సవరణ చేసుకుంటే ఎటువంటి రుసుము చెల్లించే అవసరం లేదని యూఐడీఏఐ హైదరాబాద్‌ రీజినల్‌ అధికారులు తెలిపారు. ఐదేళ్లు నిండిన తర్వాత చేసే సవరణలో పిల్లల బయోమెట్రిక్‌, ఐరిష్‌ తీసుకుంటారని తెలిపారు. సాధారణంగా 5- 7 ఏళ్లు, 15- 17 ఏళ్ల మధ్య వయసు వారికి మాత్రమే నమోదు కేంద్రాల్లో మొదటిసారి వివరాల సవరణను ఉచితంగా చేస్తారని, కానీ ఈసారి ఐదేళ్ల నుంచి 17 ఏళ్ల వయసు వారందరికీ ఈ అవకాశాన్ని సెప్టెంబరు 30 వరకు కల్పిస్తున్నామని తెలిపారు. ఆధార్‌కార్డులో చిరునామా, తదితర వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా సవరించుకునే అవకాశం ఈ ఏడాది జూన్‌ 14 వరకు ఉండగా.. మరో ఏడాది పొడిగించామని తెలిపారు.

Updated Date - May 21 , 2026 | 03:33 AM