kumaram bheem asifabad- యూడీఐడీ శిబిరాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి
ABN , Publish Date - Jun 27 , 2026 | 11:00 PM
సదరం- యూడీఐడీ శిబిరాల నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్ అన్నారు. శనివారం జూమ్ మీటింగ్ ద్వారా జిల్లా అదనపు కలెక్టర్‌లు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే సదరం- యూడీఐడీ శిబిరాలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. పెండింగ్ దరఖాస్తులు లేకుండా పరిష్కరించాలని ప్రతి నెల తప్పని సరిగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని, అర్హులైన దివ్యాంగులకు మాత్రమే దృవపత్రాలు జారీ చేయాలని తెలిపారు
ఆసిఫాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి: సదరం- యూడీఐడీ శిబిరాల నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్ అన్నారు. శనివారం జూమ్ మీటింగ్ ద్వారా జిల్లా అదనపు కలెక్టర్‌లు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే సదరం- యూడీఐడీ శిబిరాలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. పెండింగ్ దరఖాస్తులు లేకుండా పరిష్కరించాలని ప్రతి నెల తప్పని సరిగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని, అర్హులైన దివ్యాంగులకు మాత్రమే దృవపత్రాలు జారీ చేయాలని తెలిపారు. వినికిడి లోపం కలిగిన దివ్యాంగుల కోసం నిర్వహించే సదరం శిబిరాలకు అవసరమైన బేరా పరికరాల అంచనా వ్యయ వివరాలను సమర్పించాలని, సేవ ఆసరేటర్లతో ప్రత్యేక సమావేశం న్విహించి సద రం దరఖాస్తుల నమోదు ప్రక్రియను వివరించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సముదాయంలోని వీసీ హాల్ నుంచి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మీ సేవ ద్వారా సదరం శిబిరం కొరకు అందిన దరఖాస్తులను క్రమ సంఖ్య వారీగా పరిశీలించి దరఖాస్తుదారులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వైద్య పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం నియమ నిబంధనలను అమలు చేస్తున్నామని, వైద్య పరీక్షలు పారదర్శకంగా నిర్వహించ నున్నామని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.