రెయిలింగ్‌ను ఢీకొన్న బైకు.. ఇద్దరు యువకుల దుర్మరణం
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:03 AM
అతివేగంగా వచ్చిన బైకు.. రోడ్డు పక్కన ఉన్న ఇనుప రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.
ఖమ్మం - దేవరపల్లి గీన్‌ఫీల్డ్ రహదారిపై ప్రమాదం
కల్లూరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): అతివేగంగా వచ్చిన బైకు.. రోడ్డు పక్కన ఉన్న ఇనుప రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఖమ్మం - దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన కొమ్ము సాయి(35), గట్టు రాంబాబు(32) ఖమ్మం వస్తుండగా, కల్లూరు మండలంలోని లింగాల గ్రామ సమీపానికి రాగానే వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి రెయిలింగ్ ఢీకొట్టింది. అప్పటికే వేగంగా ఉండటంతో ఇద్దరూ ఎగిరి రహదారిపై పడటంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఎస్సై హరిత ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు.