Share News

Winter Tragedy: చలి మంట అంటుకుని మహిళ సజీవ దహనం

ABN , Publish Date - Jan 12 , 2026 | 04:19 AM

ఓ మహిళ ప్రమావదశాత్తు చలిమంటలో పడి మృతిచెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం బాటన్న నగర్‌కు చెందిన మాడే పిర్యా(30) ఆదివారం రాత్రి చలి...

Winter Tragedy: చలి మంట అంటుకుని మహిళ సజీవ దహనం

  • చలికి తట్టుకోలేక వృద్ధురాలి మృతి

ఆళ్లపల్లి, ఆసిఫాబాద్‌, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ఓ మహిళ ప్రమావదశాత్తు చలిమంటలో పడి మృతిచెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం బాటన్న నగర్‌కు చెందిన మాడే పిర్యా(30) ఆదివారం రాత్రి చలి ఎక్కువగా ఉండటంతో మంట(నెగడి) పెట్టుకొని నిద్రించింది. అర్ధరాత్రి ఆమెకు మంటలు అంటుకొని సజీవ దహనమైంది. మరో ఘటనలో, హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్‌లో చలికి తట్టుకోలేక గుర్తు తెలియని వృద్ధురాలు (80) మృతి చెందింది. ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(యు)లో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిర్యాణిలో 7.6, కెరమెరిలో 9.4, ఆసిఫాబాద్‌లో 10.3, వాంకిడిలో 10.7, కాగజ్‌నగర్‌, రెబ్బెన మండలాల్లో 11 సిర్పూర్‌ (టి)లో 11.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Jan 12 , 2026 | 04:20 AM