Share News

మరో ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:47 AM

నారాయణపేట జిల్లా మద్దూర్‌ మండలంలోని మోమినాపూర్‌ ఘనటలో మరో ఇద్దరు ఉపాధ్యాయులపై జిల్లా విధ్యాశాఖ సస్పెన్షన్‌ వేటువేసింది.

మరో ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

  • మోమినాపూర్‌ ఘటనలో విద్యాశాఖ చర్య

మద్దూర్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా మద్దూర్‌ మండలంలోని మోమినాపూర్‌ ఘనటలో మరో ఇద్దరు ఉపాధ్యాయులపై జిల్లా విధ్యాశాఖ సస్పెన్షన్‌ వేటువేసింది. తెలుగు ఉపాధ్యాయుడు స్వామి ఓ విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి రావడంతో ఇప్పటికే ఆయనను సస్పెండ్‌ చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఉపాధ్యాయులు, గురునాఽథ్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు చెన్నకేశవులును సస్పెండ్‌ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి గోవింద్‌రాజులు సోమవారం వెల్లడించారు. ఇదిలాఉండగా మరో నలుగురితో కలిపి వీరు ముగ్గురిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Mar 31 , 2026 | 05:47 AM