Share News

అల్వాల్‌ భూముల వ్యవహారంలో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్ల సస్పెన్షన్‌

ABN , Publish Date - May 20 , 2026 | 04:09 AM

మేడ్చెల్‌ మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్‌ పరిధిలో సర్వే నం. 582, 583లకు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్‌ వేటు పడింది.

అల్వాల్‌ భూముల వ్యవహారంలో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్ల సస్పెన్షన్‌

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్ర జ్యోతి): మేడ్చెల్‌ మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్‌ పరిధిలో సర్వే నం. 582, 583లకు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న భూములను రికార్డులు పరిశీలించకుండా క్వారీ కార్మికుల పేరుతో వంద గజాల చొప్పున రిజిస్ట్రేషన్‌ చేసినట్లు విచారణలో తేలింది. ఇదే విషయంపై ఇటీవల ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌.. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ల శాఖ మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్‌ చేసిన ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లను సస్పెండ్‌ చేయాలని ఐజీ రాజీవ్‌ గాంధీ హనుమంతును ఆదేశించారు. అక్రమాలు నిజమని తేలడంతో వల్లభనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పని చేసే సమయంలో అవకతవకలకు పాల్పడిన సబ్‌ రిజిస్ట్రార్‌ టి.శృతి, మేడ్చెల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆర్‌. సతీ్‌షను సస్పెండ్‌ చేశారు. మేడె ్చల్‌ జిల్లా రిజిస్ట్రార్‌ ఇచ్చిన విచారణ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - May 20 , 2026 | 04:09 AM