Share News

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరె స్టు

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:30 AM

: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు అంతర్రాష్ట దొంగలను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరె స్టు
కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ చరమందరాజు

హుజూర్‌నగర్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు అంతర్రాష్ట దొంగలను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ చరమందరాజు కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని కొత్తబస్టాండు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పట్టణ ఎస్‌ఐ బండి మోహన్‌ అదుపులోకి తీసుకొని విచారించారు. గుంటూరు జిల్లా మేడికొండూరు గ్రామానికి చెందిన షేక్‌. మాబు, షేక్‌. రిహాజ్‌ కొంతకాలంగా హుజూర్‌నగర్‌, కోదాడ, గుంటూరు జిల్లా టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో, మంగళగిరి పోలీస్‌స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేస్తున్నారు. రిహజ్‌ అమ్మమ్మ ఊరు అయిన గరిడేపల్లి మండలం కట్టవారిగూడెంలో మోటారు సైకిళ్లు దాచిపెట్టగా వీరివద్ద నుంచి మొత్తం ఆరు మోటారు సైకిల్‌ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా జల్సాల కోసం మోటారు సైకిల్లను చోరీ చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపార. ఇటీవల దొంగతనాలపై ఫిర్యాదు రావడం తో పట్టణంలోని కొత్తబస్టాండులో అనుమానస్పందంగా తిరుగుతున్న వారిని గుర్తించి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. రిహజ్‌ స్వస్ధలం చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామం కాగా గుంటూరు జిల్లాలో నివాసమున్నట్లు తెలిపారు. ఇద్దరు స్నేహితులు కావడంతో కలిసి దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్న ఎస్‌ఐ మోహన్‌ను సీఐ అభినందించారు. కార్యక్రమలో ఎస్‌ఐ మోహన్‌బాబు, శ్రీనివాస్‌రెడ్డి, శంభయ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 12:30 AM