Share News

గాల్లో ఉండగానే సాంకేతిక లోపం..

ABN , Publish Date - May 30 , 2026 | 04:12 AM

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం రెండు విమానాలకు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం శంషాబాద్‌ నుంచి ...

గాల్లో ఉండగానే సాంకేతిక లోపం..

  • శంషాబాద్‌లో రెండు విమానాలకు తప్పిన ప్రమాదం

శంషాబాద్‌ రూరల్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం రెండు విమానాలకు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం శంషాబాద్‌ నుంచి జగదలపూర్‌కు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్‌ అయిన కొద్ద్దిసేపటికే సాంకేతిక లోపానికి గురైంది. వెంటనే అప్రమత్తమైన పైలట్‌.. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) అనుమతితో తిరిగి విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై దించారు. మరో ఘటనలో, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం మధ్యాహ్నం రాజమండ్రికి బయలుదేరిన ఫ్లై 90 విమానంలోనూ టేకాఫ్‌ అయిన తర్వాత ఇంజన్‌ సమస్య తలెత్తింది. పైలట్‌ అప్రమత్తమై ఏటీసీ అధికారులను సంప్రదించగా, వారు అత్యవసర ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో ప్రమాదం తప్పింది.

Updated Date - May 30 , 2026 | 04:12 AM