Share News

కారు మరమ్మతు కోసం దొంగగా మారి..

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:21 AM

చెడు అలవాట్లకు బాని సైన యువకుడు అద్దె కారు మరమ్మతు చేయించేందుకు దొంగ అవతారమె త్తాడు.

కారు మరమ్మతు కోసం దొంగగా మారి..
కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ రాజశేఖర్‌రాజు

మిర్యాలగూడ అర్బన్‌, ఏప్రిల్‌29(ఆంధ్రజ్యోతి): చెడు అలవాట్లకు బాని సైన యువకుడు అద్దె కారు మరమ్మతు చేయించేందుకు దొంగ అవతారమె త్తాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చైన్‌ స్నాచిం గ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. నేరం చేసిన 24గంటల వ్యవధిలోనే పోలీసులకు చిక్కాడు. కేసు వివరాలను డీఎస్పీ రాజశేఖర్‌రాజు బుధవారం వెల్లడించారు. ఈ నెల 27న నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామానికి చెందిన యువకుడు జాజం గోపీచంద్‌ వెంబడించాడు. గౌరు వజ్రమ్మ మెడలోని సుమారు నాలుగు తులాల పుస్తెలతాడు, పగడాల గొలుసును కత్తిరించుకొని బైక్‌పై పారిపో యాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాలనీలోని సీసీకెమెరాలను పరిశీలించి నిందితుడి ఆచూకీ కనుగొన్నారు. అతనిని ఈ నెల 28వ తేదీన అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కూలీ పనులు చేసుకునేందుకు మూడేళ్ల క్రితం పట్టణానికి వల సొచ్చిన గోపీచంద్‌ బాపూజీనగర్‌లోని ఎస్‌ఆర్‌ వాటర్‌ప్లాంట్‌ ఆటో నడుపుతూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఆటో నడపడంతో వచ్చే ఆదా యం సరిపోకపోవడంతో కారును అద్దెకు తీసుకొని నడిపిస్తున్నాడు. ఈ ఆ కారు ప్రమాదంలో మరమ్మతులకు గురైంది. రిపేర్‌ చేయించేందుకు సుమా రు రూ.2లక్షలు అవసరం కావడంతో తక్కువ సమయంలో ఆ మొత్తాన్ని సంపాదించేందుకు చైన్‌స్నాచింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. రెడ్డి కాలనీలో రెక్కినిర్వహించి చైన్‌స్నాచింగ్‌ చేసేందుకు అవకాశం కోసం వేచి చూసి వజ్రమ్మ మెడలోని బంగారు ఆభరాణాలను కాజేశాడని డీఎస్పీ తెలి పారు. ప్రత్యేక పోలీస్‌ బృందాలను రంగంలోకి దింపి చోరీకి పాల్పడిన గోపీచంద్‌ను గుర్తించి అరెస్టు చేసి అతని నుంచి నాలుగు తులాల బంగారు పుస్తెలతాగు, పగడాల బంగారు గొలుసు,బైక్‌, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసు కొని రిమాండ్‌కు పంపారు. కేసును 24గంటల వ్యవధిలో ఛేదించిన వన్‌టౌన్‌ సీఐ నాగభూషణం, ఎస్‌ఐ సైదిరెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ రాజారామ్‌, పీసీలు శ్రీను, హుస్సేన్‌, వీరబాబు, నర్సింహ, ప్రసాద్‌లను డీఎస్పీ అభినందించారు.

Updated Date - Apr 30 , 2026 | 12:21 AM