Share News

నిరాశలో తునికాకు కూలీలు

ABN , Publish Date - Apr 13 , 2026 | 11:37 PM

వేసవి కాలంలో గ్రామీ ణ ప్రజలకు ఉపాధి కల్పించే తునికాకు సేకరణ ప్రశ్నార్థకంగా మా రింది. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో జిల్లాలో పది యూ నిట్లు అమ్ముడు పోలేదు.

నిరాశలో తునికాకు కూలీలు

-జిల్లాలో పది యూనిట్లకు ఖరారు కాని టెండర్లు

-కొనుగోలుకు మొగ్గు చూపని కాంట్రాక్టర్లు

-అమ్ముడు పోని యూనిట్లలో ఆకు సేకరణ లేనట్టే..

-ఏటికేడు పల్లెజనానికి దూరమవుతున్న ఉపాధి

నెన్నెల, ఏప్రిల్‌, 13 (ఆంధ్రజ్యోతి) : వేసవి కాలంలో గ్రామీ ణ ప్రజలకు ఉపాధి కల్పించే తునికాకు సేకరణ ప్రశ్నార్థకంగా మా రింది. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో జిల్లాలో పది యూ నిట్లు అమ్ముడు పోలేదు. ఫలితంగా తునికాకు సీజన్‌పై అడవి బి డ్డలు పెట్టుకున్న ఆశలు నిరుగారిపోయాయి. బీడీ ఆకుసేకరణ కో సం జిల్లాలో 21 యూనిట్లకు గాను అటవీశాఖ అధికారులు ఐదు సార్లు ఈ-టెండర్లు పిలిచారు. ఆఖరుకు 11 యూనిట్లు మాత్రమే అమ్ముడు పోగా మిగతా పది యూనిట్లకు టెండర్లు ఖరారు కా లేదు. సగం యూనిట్లు అమ్ముడు పోకపోవడంతో ఆకు సేకరణ లక్ష్యం 50 శాతానికి పడిపోనుంది. మార్చి నెలాఖరు కల్లా టెండర్లు ఖరురా చేసుకుని.. కొమ్మకొట్టే ప్రక్రియ (ప్రూనింగ్‌) పూర్తి చేసుకో వాల్సి ఉంది. కొమ్మకొడితే చెట్లు కొత్తగా చిగురించి నాన్యమైన ఆకు వస్తుంది. కొమ్మ కొట్టిన నెల రోజులకు ఆకు సేకరిస్తారు. చాక్‌త రాస్‌ చేయక పోవడంతో అమ్ముడు పోని పది యూనిట్లలో ఆకు సేకరణ లేదని స్పష్టమవుతోంది.

- లక్ష్యంలో సగమే సేకరణ..

జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు అటవి డివిజన్లు ఉ న్నాయి. ఈ సీజన్‌లో 21 యూనిట్లలో 158 కళ్లాలు ఏర్పాటు చేసి 31 వేల స్టాండర్డు బ్యాగుల ఆకు సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నా రు. కాని వాటిలో 11 యూనిట్లు మాత్రమే అమ్ముడు పోయాయి. మంచిర్యాల డివిజన్‌లోని హాజీపూర్‌, ఆవడం యూనిట్లు, చెన్నూ రు డివిజన్‌లోని భీమారం, కన్నెపల్లి, పార్పెల్లి, బద్దంపల్లి, మైలా రం, నీల్వాయి యూనిట్లు, బెల్లంపల్లి డివిజన్‌లోని నార్వాయి పే ట, వేమనపల్లి, కుశ్నపల్లి యూనిట్లను మాత్రమే అమ్ముడుపో యాయి. మిగతా పది యూనిట్లు సెల్‌ కాలేదు. జిల్లాలో మొత్తం 31 వేల స్డాండర్డ్‌ బ్యాగుల ఆకు సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా అ మ్ముడుపోయిన 11 యూనిట్లలో 14,400 స్టాండర్డ్‌ బ్యాగుల ఆకు మాత్రమే సేకరించనున్నారు. అంటే లక్ష్యంలో సగానికి కంటే తక్కు వ అకు సేకరణ జరగనుంది.

-ఏటికేడు దూరమవుతున్న ఉపాధి

గ్రామీణ ప్రజలకు తునికాకు సేకరణతో అనాదిగా వస్తున్న ఉ పాధి కాస్తా క్రమేపి దూరం అవుతోంది. పల్లె జనానికి వ్యవసాయ పనులు లేని వేసవి కాలంలో బీడీఆకు సేకరణ ఉపాధినిచ్చేది. ఒ క్కొక్కరికి రోజుకు రూ.500ల నుంచి రూ.700ల వరకు గిట్టుబా టయ్యేది. పైగా వేల రూపాయలు లాభాల బోనస్‌ వచ్చేది. జిల్లా లో వేసవిలో సుమారుగా 20 వేల మందికి పైగా కూలీలు ఉపాధి పొందేవారు. నెల రోజుల పనితో ఆర్నేళ్లకు సరిపడ భత్యం లభి స్తుండటంతో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేవారు. ఈ యేడు 50 ఆకుల కట్టకు రూ. 3.50లుగా నిర్ణయించారు. అట వీశాఖ తరపున తునికాకు కూలీలకు జాబ్‌కార్డులు అందజేసి బీ మా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. ఆకు సేకరణలో వచ్చే ఆ దాయాన్ని కూలీలకే బోనస్‌ రూపంలో చెల్లిస్తుండటంతో సీజన్‌ కోసం చాలా మంది ఎంతో ఆశగా ఎదురు చూసేవారు. చాక్‌త రా స్‌, ఆకుసేకరణ, కళ్లాల నిర్వహన, కట్టలు తిప్పడం, బస్తాలు నిం పడం, బీడీల తయారీ తదితర పనులతో ప్రతి సీజన్‌లో వేల మం ది ఉపాధి పొందేవారు. పది యూనిట్లలో ఆకు సేకరణ లేక పో వడంతో ఆ ప్రాంతాలకు చెందిన వారందరూ నిరాశలో ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే కాలంలో ఆకుల కళ్లాలు కను మరుగయ్యే అవకాశాలు లేక పోలేదు.

తగ్గిన డిమాండ్‌...

జిల్లాలోని నాణ్యమైన బీడీ ఆకు లభిస్తుందని, గతంలో ఇక్కడ యూనిట్లు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌, బ ర్మా, శ్రీలంక లాంటి విదేశాలకు తునికాకు ఎగుమతి చేసేవారు. 18 శాతం జీఎస్టీ విధించడంతో పాటు ఏటికేడు కట్ట ధర పెంచుతూ పోవడంతో కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు మహా రాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మద్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో తక్కువ ధరకు మంచి ఆకు లభిస్తుందని కాంట్రాక్టర్లు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. దీంతో జిల్లాలోని యూనిట్లకు డిమాండ్‌ తగ్గిందని అంటున్నారు.

వేసవిలో ఉపాధి లేకుండా పోతోంది..

గొర్లపల్లి లస్మయ్య, నెన్నెల

ఎండకాలంలో వ్యవసాయ పనులు ఉండవు. పల్లెల్లో కూలీ పనులు దొరకవు. యేటా తునికాకు తెంపడానికి పోతే బోలెడు పైసలు చేతికొచ్చేటివి. బోనస్‌ కూడా వచ్చేది. ఆకుల కోసం చిన్నా పెద్దా అందరం కలిసి అడివికి పోయేటోల్లం. రోజుకు ఒకరికి ఐదా రు వందల దాక గిట్టుబాటయ్యేది. ఈ సారి నెన్నెల యూనిట్‌ అ మ్ముడు పోలేదట. చాక్‌తరాస్‌ చేయలేదు. ఆకుల కళ్లం పెట్టరు. రానురాను పల్లెల్లో ఆకుల కల్లాలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చే లా ఉంది.

Updated Date - Apr 13 , 2026 | 11:38 PM