పాల్వంచ గుట్ట వెంకన్న కల్యాణం కమనీయం
ABN , Publish Date - Mar 16 , 2026 | 03:55 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాసకాలనీ గుట్టపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా..
హాజరైన మంత్రులు పొంగులేటి, తుమ్మల
1600 మెట్లెక్కి ఆలయానికి చేరుకున్న సచివులు
పాల్వంచ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాసకాలనీ గుట్టపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఆదివారం స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. దీనికి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు వేర్వేరుగా హాజరయ్యారు. 1600 మెట్లెక్కి మంత్రులు ఆలయానికి చేరుకున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులకు అర్చకులు, కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గుట్ట ప్రాంతాన్ని పర్యాటకంగా, పవిత్ర క్షేత్రాన్ని ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయన్నారు.
