Minister Tummala Nageshwar Rao: అగ్రి డాక్టర్స్ డైరీని ఆవిష్కరించిన తుమ్మల
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:01 AM
తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ (టాడా)- 2026 డైరీని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఆవిష్కరించారు.
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ (టాడా)- 2026 డైరీని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో టాడా డైరీతో పాటు కొత్త సంవత్సరం క్యాలెండర్‌ను కూడా తుమ్మల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నదని అన్నారు. దశాబ్దాలుగా వాయిదా పడుతూ వస్తున్న ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేసినందుకు మంత్రి తుమ్మలకు టాడా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.