Share News

ప్రకృతి వ్యవసాయంతోనే మేలు: తుమ్మల

ABN , Publish Date - Apr 01 , 2026 | 05:06 AM

రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని, నానో యూరియా వాడకానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

ప్రకృతి వ్యవసాయంతోనే మేలు: తుమ్మల

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని, నానో యూరియా వాడకానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఈ దిశగా వ్యవసాయశాఖ అధికారులు రైతులను ప్రోత్సహించాలన్నారు. మంగళవారం సచివాలయం నుంచి నిర్వహించిన రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి తుమ్మల రైతులతో ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 1,600 రైతు వేదికల నుంచి రైతులు ఇందులో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌.. రైతులకు, అధికారులకు ప్రకృతి వ్యవసాయం, నానో యూరియా వాడకంపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు తమ సాగు అనుభవాలను పంచుకున్నారు.

Updated Date - Apr 01 , 2026 | 05:07 AM