Share News

పునర్విభజనతో మాకే లాభం

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:35 AM

శాసనసభ, పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అది కచ్చితంగా అధికార పార్టీకే లాభమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు...

పునర్విభజనతో మాకే లాభం

  • గతంలోనూ కాంగ్రెస్‌కే లాభం జరిగింది

  • అసంతృప్తులకు మంచి అవకాశం: తుమ్మల

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : శాసనసభ, పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అది కచ్చితంగా అధికార పార్టీకే లాభమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. మంగళవారం శాసనసభ లాబీలో తన ఛాంబర్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ఆయన స్పందించారు. డీలిమిటేషన్‌ మార్గదర్శకాలు ఎలా వస్తాయో వేచి చూడాల్సివుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని, ముఖ్యంగా అధికార పార్టీలోని అసంతృప్త నేతలను సంతృప్తిపరిచే అవకాశం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నియోజకవర్గాల పునర్విభజన జరిగిందని, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకే లాభం జరిగిందన్నారు. జనాభా ప్రాతిపదికన అయితే హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని తుమ్మల అభిప్రాయపడ్డారు.

Updated Date - Mar 25 , 2026 | 04:35 AM