Share News

శంషాబాద్‌ దాకా ఉచిత ప్రయాణం

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:08 AM

హైదరాబాద్‌-బెంగళూరు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. సాయంత్రం 6 గంటల తర్వాత..

శంషాబాద్‌ దాకా ఉచిత ప్రయాణం

  • హైదరాబాద్‌- బెంగళూరు ప్రయాణికులకు ఆర్టీసీ ఆఫర్‌

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-బెంగళూరు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. సాయంత్రం 6 గంటల తర్వాత బయలుదేరే హైదరాబాద్‌-బెంగళూరు సర్వీసుల్లో శంషాబాద్‌ (ఆర్‌జీఐ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా) బోర్డింగ్‌ పాయింట్‌గా టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునే ప్రయాణికులకు శంషాబాద్‌ వరకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఆయా ప్రయాణికులను ఏసీ, పుష్పక్‌ బస్సుల్లో శంషాబాద్‌ వరకు ఉచితంగా తీసుకెళ్తామని వెల్లడించింది. ప్రస్తుతం మియాపూర్‌, నిజాంపేట్‌, జేఎన్‌టీయూ, గచ్చిబౌలి, కొండాపూర్‌, హఫీజ్‌పేట్‌, లింగంపల్లి, మెహిదీపట్నం తదితర ప్రాంతాల నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు ముందుగా ఎంజీబీఎస్‌ చేరుకునేందుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌లో 2గంటలకుపైగా ప్రయాణించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తగ్గించేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకు శంషాబాద్‌ వరకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రకటించారు.

Updated Date - Jul 05 , 2026 | 05:08 AM