ఒకే రోజు 2ఎంట్రెన్స్ టెస్టులు !
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:28 AM
తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు (టీజీఆర్‌జేసీ), కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో (కేజీబీవీ) ఇంటర్ ప్రవేశాల కోసం...
టీజీఆర్‌జేసీ, కేజీబీవీ పరీక్షలు..అయోమయంలో విద్యార్థులు
పెద్దపల్లి, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు (టీజీఆర్‌జేసీ), కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో (కేజీబీవీ) ఇంటర్ ప్రవేశాల కోసం ఒకే రోజు, ఒకే సమయంలో కామన్ ఎంట్రెన్స్ టెస్టు నిర్వహిస్తుండడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఈ రెండు పరీక్షలు మే 3న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు జరగనున్నాయి. దీంతో రెండింటి కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏదో ఒక పరీక్ష మాత్రమే రాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయమై వెంటనే ప్రభుత్వం స్పందించి ఒకే రోజు కాకుండా వేర్వేరు తేదీల్లో పరీక్ష నిర్వహించాలని విద్యార్థులతో పాటు వారి తల్లితండ్రులు కోరుతున్నారు.