Share News

డైట్‌ కాలేజీల్లో 86 మంది అధ్యాపకుల భర్తీకి నోటిఫికేషన్‌

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:41 AM

పాఠశాల విద్యాశాఖ పరిధిలోని డైట్‌ కళాశాలల్లో 86 మంది అధ్యాపకుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

డైట్‌ కాలేజీల్లో 86 మంది అధ్యాపకుల భర్తీకి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖ పరిధిలోని డైట్‌ కళాశాలల్లో 86 మంది అధ్యాపకుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డైట్‌ కళాశాలల్లోని 23 మంది సీనియర్‌ లెక్చరర్లు, 63 లెక్చరర్‌ పోస్టులను భర్తీకి దరఖాస్తులు పిలిచింది. ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 44 సంత్సరాలుగా ఖరారు చేశారు. ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణ ప్రారంభమవుతుందని, దరఖాస్తుల సమర్పణకు జూలై 29 తుది గడువు అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 03:41 AM