Share News

ఐసెట్‌ కోసం టీ-సాట్‌ డిజిటల్‌ ప్రసారాలు

ABN , Publish Date - Feb 23 , 2026 | 03:01 AM

తెలంగాణ ఐసెట్‌- 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం డిజిటల్‌ ప్రసారాలు అందించేందుకు టీ-సాట్‌ నె ట్‌వర్క్‌ సిద్ధమైంది.

ఐసెట్‌ కోసం టీ-సాట్‌ డిజిటల్‌ ప్రసారాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఐసెట్‌- 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం డిజిటల్‌ ప్రసారాలు అందించేందుకు టీ-సాట్‌ నె ట్‌వర్క్‌ సిద్ధమైంది. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించేఐసెట్‌కు సంబంధించిన పాఠ్యాంశాల ప్రసారం సోమవారం (23వ తేదీ) నుంచి ప్రారంభమవుతుందని టీ-సాట్‌ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌ రెడ్డి ఆదివారం తెలిపారు. ఎనలిటిక్‌ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్‌, కమ్యూనికేషన్‌ ఎబిలిటీ తదితర సబ్జెక్టులపై రోజుకు రెండు సబ్జెక్టుల చొప్పున ప్రసారం చేయనున్నామని, విద్యా చానల్‌లో ఉదయం 5 నుంచి 6 గంటల వరకు, నిపుణ చానల్‌లో సాయంత్రం 5-6 గంటల వరకు పాఠాలు ప్రసారమతాయని తెలిపారు.

Updated Date - Feb 23 , 2026 | 03:01 AM