Share News

పీజీఈసెట్‌కు 24,550 దరఖాస్తులు

ABN , Publish Date - May 15 , 2026 | 05:01 AM

ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంజనీరింగ్‌ పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్‌)- 2026కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం...

పీజీఈసెట్‌కు 24,550 దరఖాస్తులు

  • 28 నుంచి పరీక్షలు, 19 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌

హైదరాబాద్‌ సిటీ, మే 14 (ఆంధ్రజ్యోతి): ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంజనీరింగ్‌ పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్‌)- 2026కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,550 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్‌ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈనెల 28 నుంచి 31 వరకు మొత్తం ఆరు సెషన్లలో 19 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 19 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కన్వీనర్‌ వెల్లడించారు.

Updated Date - May 15 , 2026 | 05:01 AM