నేడు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్ల్లిమెంటరీ ఫలితాలు
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:34 AM
ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఉదయం 11:30 గంటలకు ఫలితాలు ఆన్‌లైన్లో విడుదల ...
హైదరాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఉదయం 11:30 గంటలకు ఫలితాలు ఆన్‌లైన్లో విడుదల చేస్తామని ఇంటర్ విద్య కార్యదర్శి అభిలాష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గత నెల 13 నుంచి 21 వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 889 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 3,98,358 మంది హాజరవగా.. 2,67,285 మంది ప్రథమ, 1,31,073 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లు https://tgbie.cgg.gov.in, https://results.cgg.gov. సందర్శించాలని ఇంటర్ బోర్డు సూచించింది.