మే 12న ఎడ్‌సెట్
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:47 AM
టీజీ ఎడ్‌సెట్-2026 షెడ్యూల్ విడుదలైంది. మే నెల 12న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4గంటల వరకు రెండో సెషన్ పరీక్ష....
నేటి నుంచి ఏప్రిల్ 15 దాకా దరఖాస్తులు
హనుమకొండ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): టీజీ ఎడ్‌సెట్-2026 షెడ్యూల్ విడుదలైంది. మే నెల 12న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4గంటల వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుంది. పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 16 పట్టణాల్లో 58 సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న టీజీ ఎడ్‌సెట్-2026 షెడ్యూల్‌ను వీసీ ప్రతాప్ రెడ్డి సోమవారం ఇక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌ను ఆయన ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎడ్‌సెట్-2026 కోసం మంగళవారం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫీజు ఓసీలు, బీసీలకు రూ.750.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.550గా నిర్ణయించారు. దరఖాస్తులకు ఏప్రిల్ 15 చివరి తేదీ. అపరాధ రుసుము రూ.250తో ఏప్రిల్ 22 వరకు, రూ.500తో ఆ నెల 27వరకు, రూ.1000తో ఆ నెల 30 వరకు, రూ.5వేల రుసుముతో మే8వ తేదీ వరకు దరఖాస్తు చేయొచ్చు. మే 9 నుంచి వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.