ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల
ABN , Publish Date - May 31 , 2026 | 05:47 AM
తెలంగాణ ఎడ్‌సెట్- 2026 ఫలితాలను శనివారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. అబ్బాయిల్లో 4802 మంది, అమ్మాయిల్లో 23,642 మంది అర్హత సాధించారు.
96.95శాతం ఉత్తీర్ణత.. అమ్మాయిల్లో 23,642 మంది అర్హత
భద్రాద్రి కొత్తగూడెం వాసికి స్టేట్ ఫస్ట్ ర్యాంకు
హైదరాబాద్/కేయూ క్యాంపస్, మే 30(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎడ్‌సెట్- 2026 ఫలితాలను శనివారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. అబ్బాయిల్లో 4802 మంది, అమ్మాయిల్లో 23,642 మంది అర్హత సాధించారు. మొత్తంగా 96.95 మంది ఉత్తీర్ణత సాధించారు. కొత్తగూడెం జిల్లా ఆదర్శ్‌నగర్‌కాలనీకి చెందిన బానోతు అజిత్ సాయి కృష్ణ 124.65 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. సూర్యాపేట శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన పోతుగంటి తరుణ్‌కుమార్ 122.81 రెండో ర్యాంకు, మహబుబ్‌నగర్ జిల్లా క్రిస్టియన్‌పల్లి అయోధ్య నగర్‌కాలనీకి చెందిన నీరటి ఉదయ్‌కుమార్‌రెడ్డి 122 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. ఈ కార్యక్రమంలో ఎడ్‌సెట్-2026 చైర్మన్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ బైరు వెంకట్రామ్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, ఓపెన్ ఇంటర్, పదో తరగతి ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. ఓపెన్‌టెన్త్ పరీక్షలకు 36,863మంది హాజ రు కాగా.. 26,542 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ పరీక్షలను 54,679 మంది రాయగా.. 37,562 మంది పాసయ్యారు. టెన్త్‌లో 72శాతం, ఇంటర్‌లో 68.70శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను www.telanganaopenschool.org సైట్‌లో చూసుకోవచ్చు.