ఎప్‌సెట్ పరీక్షలు ప్రారంభం.. 92 శాతం హాజరు
ABN , Publish Date - May 05 , 2026 | 04:14 AM
ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కాలేజీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్, మే 4 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కాలేజీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని 4 కేంద్రాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు ఉదయం 9-12 గంటల వరకు, మధ్యాహ్నం 3-6 గంటల వరకు పరీక్షలు జరిగాయి. ఉదయం సెషన్‌కు 30,333 మందికి విద్యార్థులకు గాను 28,046 మంది (92.46శాతం), మధ్యాహ్నం సెషన్‌కు 30,253 మందికి 28,241 (93.35 శాతం) మంది హాజరయ్యారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిస్టారెడ్డి, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ నగరంలోని పరీక్షా కేంద్రాలకు వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు.