kumaram bheem asifabad- నేడు టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత రాక
ABN , Publish Date - Jun 14 , 2026 | 10:36 PM
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించే తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వినోద్ తెలిపారు. స్థానికంగా ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు పార్టీ జెండావిష్కరణతో పాటు కార్యాలయం ప్రారంభోత్సవం నిర్వహించనున్నామని చెప్పారు. అంతకు ముందు ఫారెస్ట్ చెక్ పోస్టు నుంచి అంబేద్కర్‌చౌక్, గాంధీచౌక్, వివేకానందచౌక్, కుమరం భీం చౌక్‌ల మీదుగా ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
ఆసిఫాబాద్‌రూరల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించే తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వినోద్ తెలిపారు. స్థానికంగా ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు పార్టీ జెండావిష్కరణతో పాటు కార్యాలయం ప్రారంభోత్సవం నిర్వహించనున్నామని చెప్పారు. అంతకు ముందు ఫారెస్ట్ చెక్ పోస్టు నుంచి అంబేద్కర్‌చౌక్, గాంధీచౌక్, వివేకానందచౌక్, కుమరం భీం చౌక్‌ల మీదుగా ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అనంతరం మహనీయులకు పూల మాలలు వేసి నివాళులు అర్పించి తిరిగి పార్టీ కార్యాలయానికి చేరుకుంటారన్నారు. ఆమె వెంట మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు, పలువురు రాష్ట్ర నాయకులు రానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్యాంరావు, రాంప్రసాద్, సాయి, మైనోద్దీన్, వినోద్, తిరుపతి, శ్రీనివాస్, అబ్బు తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్ టౌన్, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారని టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కావేటి సబిత మనోహర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. . కౌటాల మండలంలోని తుమ్డిహేటి ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించిన అనంతరం సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల నిరవధిక దీక్షలకు సంఘీభావం తెలియజేస్తారని పేర్కొన్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.