Share News

20 నుంచి టీఆర్‌ఎస్‌ జెండా పండుగ

ABN , Publish Date - May 19 , 2026 | 04:29 AM

పార్టీ లక్ష్యాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఈ నెల 20 నుంచి జూన్‌ 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) జెండా పండుగ చేపట్టనున్నట్లు...

20 నుంచి టీఆర్‌ఎస్‌ జెండా పండుగ

  • పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరిద్దాం

  • పార్టీ శ్రేణులతో కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): పార్టీ లక్ష్యాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఈ నెల 20 నుంచి జూన్‌ 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) జెండా పండుగ చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. బంజారాహిల్స్‌లోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పార్టీ జనరల్‌ బాడీ సమావేశంలో జెండా గద్దెల మోడల్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా, మండల కేంద్రాలు, అలాగే గ్రామ స్థాయి వరకు ప్రతి వార్డులో పార్టీ జెండాలు ఎగురవే యాలని, అదే సమయంలో పార్టీ ప్రకటించిన పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. తెలంగాణ పునర్నిర్మాణం, సబ్బండ వర్గాల వికాసం కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. అందులో భాగంగానే.. తెలంగాణ రక్షణ సేన జెండాను ప్రతి వాడకు, పార్టీ సిద్ధాంతాలను ప్రతి గడపకు తీసుకు వెళ్లాలని సూచించారు.

Updated Date - May 19 , 2026 | 04:29 AM