Share News

kumaram bheem asifabad- ఇన్‌చార్జి అధికారులతో ఇక్కట్లు

ABN , Publish Date - Apr 29 , 2026 | 10:59 PM

జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన మండ లంలో పూర్తి స్థాయి అధికారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ప్రజలకు పాలనా పరంగా దగ్గరయ్యేందుకు 2016 అక్ట్టోబరు 11న కొత్త జిల్లాలు మండలాలు ఏర్పాటులో భాగంగా ఉమ్మడి కౌటాల మండలంలో ఉన్న చింతలమానేపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేశారు.

kumaram bheem asifabad- ఇన్‌చార్జి అధికారులతో ఇక్కట్లు
చింతలమానేపల్లి మండలం

- ఇబ్బందులు పడుతున్న ప్రజలు

చింతలమానేపల్లి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యో తి): జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన మండ లంలో పూర్తి స్థాయి అధికారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ప్రజలకు పాలనా పరంగా దగ్గరయ్యేందుకు 2016 అక్ట్టోబరు 11న కొత్త జిల్లాలు మండలాలు ఏర్పాటులో భాగంగా ఉమ్మడి కౌటాల మండలంలో ఉన్న చింతలమానేపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీస్‌ స్టేషన్‌ తహసీల్దార్‌ కార్యాల యాలను మాత్రమే ఏర్పాటు చేసి అట్టాహా సంగా ప్రారంభించారు. మండలం ఏర్పాటు చేసి పది సంవత్సరాలు కావస్తున్నా నేటికి పూర్తి స్థాయి కార్యాలయాలను, అధికారులను ఏర్పాటు చేయకపోడంతో మండల వాసులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

పరిస్థ్థితి ఇలా..

తహసీల్దార్‌ కార్యాలయంలో ఇన్నాళ్లు తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన వెంకటే శ్వర్‌రావు బదిలీపై వెళ్లగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్‌ దౌలత్‌కు బాధ్యతలు అప్పగించారు. పూర్తి స్థాయిలో అధికారి లేకపోవడంతో వివిధ పనులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మం డల ప్రజలు వాపోతున్నారు. విద్యాశాఖ పరంగా ఎంఈవోగా పాఠశాల ప్రధానోపాధ్యా యుడిగా విధులు నిర్వహిస్తున్న జయ రాజును ఎంఈవోగా నియమించారు. పాఠశాల ప్రధానోపాద్యాయ పనులు, ఎంఈవో భాధ్యతలు ఇబ్బందిగా మారు తోంది. పాఠశాలల పర్యవేక్షణ సరిగా ఉండ డం లేదన్న విమర్శలున్నాయి. ఎంపిడీవో కార్యాలయంలో ఎంపిడీవోగా సుధాకర్‌ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యాలయం లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కార్యాలయం కూడా ఏర్పాటు చేసి నడుపుతున ్నారు. ఇది శిథిలావస్థలో ఉండడంతో ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది, అధికారులు భయంగా విధులు నిర్వహించాల్సి వస్తున్నది. ఇతర ముఖ్య కార్యాలయాలైన వ్యవసాయ పను లకు సంబంధించి రైతు వేదికల్లో నిర్వహిస్తు న్నారు. వ్యవసాయ అధికారులు సైతం గ్రామాల్లో పర్యటించి రైతులకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. విధ్యావనరులకార్యాలయాలు ప్రత్యేకంగా ఏవీ ఏర్పాటు చేయలేదు. కార్యాలయాలు ఏర్పాటు చేయకపోయిప్పటికీ, అధికారులను సైతం స్థానికంగా ఉండకపోవడంతో మండల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

12 పంచాయతీలతో..

చింతలమానేపల్లి మండలాన్ని 12 గ్రామ పంచాయతీలతో ఏర్పాటు చేశారు. బెజ్జూరు మండలంలో ఉన్న కర్జెల్లి, గూడెం, దిందా, రుద్రాపూర్‌ గ్రామాలు, సిర్పూర్‌ మండలంలో ఉన్న డబ్బా, కౌటాల మండలంలో ఉన్న గంగాపూర్‌, రణవెల్లి, బాబాపూర్‌, చింతల మానేపల్లి, బాబాసాగర్‌, రవీంద్రనగర్‌, బాలా జీ అనుకోడ గ్రామ పంచాయతీలను కలుపు కొని మండలాన్ని ఏర్పాటు చేయగా గ్రామ పంచాయతీల పునర్విభజనలో భాగంగా 19 గ్రామ పంచాయతీలకు పెంచారు. కొత్త మండలాలు ఏర్పాటు చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఇంచార్జీ అధికారులు, పూర్తి స్థాయిలో కార్యాయాలు లేకపోవడంతో ఇవేం ఇబ్బందులని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నా రు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి పూర్తి స్థాయి కార్యాలయాలతో పాటు, అధికారులను నియమించాలని మండల ప్రజలు కోరుచున్నారు.

ప్రజలకు తప్పని ఇబ్బందులు..

- రంగన్న, కర్జెల్లి

కొత్త మండలాలు ఏర్పాటు చేసి ప్రజలకు పాలన అందించడం సంతోషించదగ్గ విష యమే. కానీ పూర్తి స్థాయి కార్యాలయాలు, అధికారులు లేక పోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి నూతనంగా ఏర్పాటు చేసిన మండలాల్లో అధికారులను నియమించాలి.

Updated Date - Apr 29 , 2026 | 10:59 PM