kumaram bheem asifabad-తీరనున్న కష్టాలు
ABN , Publish Date - Apr 05 , 2026 | 10:34 PM
ఏటా వర్షాకాలం వస్తుందంటే ఏజెన్సీ గ్రామాల్లో వణుకు మొదల వుతుంది. లోలెవల్ వంతెనలపై నుంచి ఉధృతంగా ప్రవహించే వాగులు, అనుహ్యంగా వచ్చే వరదలతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అత్యవసర వైద్య సేవలు, నిత్యావసర సరుకుల కోసం ఆయా గ్రామాల ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం. ఒక్కోసారి వరద ప్రవాహాన్ని దాటుతూ ప్రమాదాలకు గురైన సంఘటనలు సైతం చోటు చేసుకున్నాయి.
లింగాపూర్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): ఏటా వర్షాకాలం వస్తుందంటే ఏజెన్సీ గ్రామాల్లో వణుకు మొదల వుతుంది. లోలెవల్ వంతెనలపై నుంచి ఉధృతంగా ప్రవహించే వాగులు, అనుహ్యంగా వచ్చే వరదలతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అత్యవసర వైద్య సేవలు, నిత్యావసర సరుకుల కోసం ఆయా గ్రామాల ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం. ఒక్కోసారి వరద ప్రవాహాన్ని దాటుతూ ప్రమాదాలకు గురైన సంఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. తాజాగా ఏజెన్సీ మండలాల్లోని లోలెవల్ వంతెనలపై హైలెవల్ వంతెనల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఇంతకాల అష్టకష్టాలు పడిన గిరిజనులకు ఇబ్బందులు తొలగనున్నాయి. లింగాపూర్ మండలంలోని అల్లిగూడా నుంచి కొత్తపల్లి రోడ్డుపై గల లోలెవల్ వంతెనల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఐదు దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న గ్రామాల్లోని ఆదివాసీ గిరిజనులు వర్షాకాలంలో వంతెనలు దాటనీయక పోవడంతో అవస్థలు పడుతున్నారు. ఈ ప్రాంతంలో పనిచేసే ఉపాధ్యాయులు సైతం విధులు నిర్వహించుకొని తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు సైతం కొన్ని సార్లు తీవ్ర ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మండ లంలోని ఘూంనూర్ కే, ఘూంనూర్ బి, కంచన్‌పల్లి, ములాగూడా, మోతిపట్టార్, వంకామద్ది-1 వంకామ ద్ది-2, ఫట్కల్‌మంగి, సూర్పంగూడా, పవుర్‌గూడా, కొత్తపల్లి, తదితరా గ్రామాలు ఈలోలెవల్ వంతెనలపై బ్రిడ్జిల నిర్మాణం చేపట్టక పోవడంతో వర్షాకాలంలో వరదలు వస్తే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. తాము పడుతున్న ఇబ్బందులను నాయకులు, అధికారులకు చెప్పినా గోడు పట్టించుకోవడం లేదనే చెబుతు న్నారు. కానీ ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కె హరిత లోలెవల్ వంతెనలు పరిశీలించారు. హైలెవల్ వంతెనలు నిర్మిస్తామని చెప్పడంతో మండలంలోని ఎనిమిది గ్రామాల గిరిజనుల ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం వీటి మంజూరుకు అనుమతు ఇవ్వడంతో పనులు సాగనున్నాయని చెబుతున్నారు. వంతెనలు పూర్తయితే దశాబ్దాలుగా తాము పడుతున్న కష్టాలు తీరుతాయని ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ. కోటి 20 లక్షలతో ప్రతిపాదనలు..
- ధర్మేందర్., జిల్లా పంచాయతీరాజ్ ఛీఫ్ ఇంజినీర్
లింగాపూర్ మండలంలోని అలిగూడా నుంచి కొత్తపల్లి వరకు లోలెవల్ వంతెనాలపై హైలెవల్ నిర్మాణానికి నూ. కోటి 20 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేశాం. టెండర్ ప్రక్రియ పూర్తవగానే పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.