Share News

అకాల వర్షంతో అతలాకుతలం

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:00 PM

మండలంలో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం మామిడి రైతులకు అపార నష్టం మిగిల్చింది. బలమైన ఈదురుగాలులకు మామిడికాయలు నేలరా లాయి. గాలివేగానికి కిందపడిన కాయలు పగిలి పనికి రాకుండా పోయా యి.

అకాల వర్షంతో అతలాకుతలం
నెన్నెల మండలం జెండావెంకటాపూర్‌లో నేల రాలిన మామిడి కాయలు ఎత్తుతున్న రైతు

అన్నదాతలను దెబ్బతీసిన అకాల వర్షం..

ఈదురు గాలులతో మామిడి, వరి, మొక్క జొన్నకు నష్టం

ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు

==========================

అన్నదాతల ఆశలు నేలరాలాయి. సోమవారం అర్థరాత్రి కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా మామిడి, మొక్కజొన్న, వరి పంటలు సగానికి పైగా దెబ్బతిన్నాయి. ఎన్నో ఆశలతో రైతులు కష్టపడి పండించుకున్న పంటలు ఒక్క రాత్రితో కోలుకోలేని దెబ్బతీశాయి. బలమైన గాలులు వీయడంతో మామిడి కాయలు నేలరాలాయి. మొక్కజొన్న పంట పూర్తిగా వాలిపోయి తీవ్ర నష్టం తెచ్చిపెట్టింది. అలాగే మరికొద్ది రోజుల్లో కొతలకు సిద్ధమవుతున్న వరి పంట కూడా అన్నదాతలకు అపార నష్టం తెచ్చిపెట్టింది. ఇక మరి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ స్థంభాలు కూలడం..పెద్దపెద్ద వృక్షాలు నేల కూలాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో చేతికి వచ్చిన 2143 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిళ్లగా, 1792 ఎకరాల్లో మొక్కజొన్న, 351 ఎకరాల్లో వరి పంటకు నష్టం కలిగినట్లు అంచనా..

==========================

నెన్నెల, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : మండలంలో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం మామిడి రైతులకు అపార నష్టం మిగిల్చింది. బలమైన ఈదురుగాలులకు మామిడికాయలు నేలరా లాయి. గాలివేగానికి కిందపడిన కాయలు పగిలి పనికి రాకుండా పోయా యి. ఈ ఏడు ప్రతికూల పరిస్థితులు, చీడపీడల దాడితో మామిడి అం తంత మాత్రమే కాసింది. కాతను కాపాడుకుని కొంతలో కొంతైన నష్టం పూడ్చుకోవాలనుకున్న రైతుల ఆశలు నీరుగారిపోయాయి. చెట్లకు ఉన్న నాలుగు కాయలను ఈదురుగాలులు ఊడ్చుకెల్లాయని రైతులు వాపోతు న్నారు. మండలంలోని మన్నెగూడం, నందులపల్లి, ఘన్‌పూర్‌, మైలారం, గొళ్లపల్లి, చిత్తాపూర్‌, ఆవడం, మెట్‌పల్లి, నార్వాయిపేట, కొత్తూరు, జెండా వెంకటాపూర్‌, జోగాపూర్‌ తదితర గ్రామాల రైతులు నష్టపోయారు. ఈ అకాల వర్షంతో వరి, మక్క రైతులు కూడా నష్టపోయారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి, నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని మండల రైతులు కోరుతున్నారు.

లక్షెట్టిపేట: లక్షెట్టిపేట పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రా మాల్లో సోమవారం అర్థరాత్రి ఈదురు గాలులు ఉరుములు మెరు పు లతో బారీ వర్షం కురిసింది. మొక్కజొన్న పంటలు నేలకొరగడంతో రైతు లు ఆవేదన వ్యక్తం చేసారు. మంగళవారం ఉదయం వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో తిరుగుతు నష్టపోయిన పంటలను పరిశీలించారు. మండలంలో సుమారు 200ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టపోయినట్లు అంచనా వేస్తున్నామని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్‌ తెలి పారు. మండలంలో వీచిన గాలివానకు సుమారు ఆరు విద్యుత్‌ ఫోల్స్‌ దెబ్బతినడంతో సమాచారం అందుకున్న అధికారులు మరమ్మతులు జరిపారు.

శ్రీరాంపూర్‌ : సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో 7వ డివి జన్‌ పరిధిలో నాలుగు విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. ఎస్‌డీ క్వార్టర్స్‌ లోని పోస్టాఫీస్‌ లైన్‌లో చెట్టు విరిగి విద్యుత్‌ లైన్‌పై పడడంతో నాలుగు కరెంటు పోళ్లు విరిగి కిందపడ్డాయి. విషయం తెలుసుకున్న మంచిర్యాల మేయర్‌ ధర్ని మధుకర్‌, 7వ డివిజన్‌ కార్పొరేటర్‌ వేల్పుల రవీందర్‌తో కలిసి విద్యుత్‌ స్తంభాలను పరిశీలించారు. వెంటనే సింగరేణి అధికారు లతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ చేయాలని ఆదేశించారు.

చెన్నూరు: మండలంలో సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడి న వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. సుద్దాల, కన్నెపల్లి, బుద్దారం, లంబడిపల్లి, సంకారం, అంగ్రాజ్‌పల్లి, ఎర్రగుంటపల్లి, కొమ్మెర, లింగంపేట, కిష్టంపేట గ్రామాల్లో మామిడికాయలు నేలరాలిపోయాయి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

(తరువాయి 7లో)

Updated Date - Mar 31 , 2026 | 11:00 PM