బెంగాలీలో గవర్నర్ ఇంద్రసేన ప్రసంగం
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:26 AM
త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి గణతంత్ర వేడుకల్లో బెంగాలీ భాషలో ప్రసంగించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
త్రిపుర ముఖ్యమంత్రి, మంత్రుల ప్రశంసలు
హైదరాబాద్, అగర్తల, జనవరి 26(ఆంధ్రజ్యోతి): త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి గణతంత్ర వేడుకల్లో బెంగాలీ భాషలో ప్రసంగించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోమవారం అస్సాం రైఫిల్స్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో త్రిపుర సాధించిన అభివృద్ధిని గవర్నర్ వివరించారు. ముఖ్యమంత్రి మాణిక్ సాహా, మంత్రివర్గ సభ్యులు, ఉన్నతాధికారులు గవర్నర్‌కు బెంగాలీపై ఉన్న పట్టును చూసి ప్రశంసించారు. త్రిపుర పౌరులు, విద్యార్థులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.