Share News

ఆదర్శ నేత.. జైపాల్‌రెడ్డి: ఉత్తమ్‌

ABN , Publish Date - Jan 17 , 2026 | 06:45 AM

దివంగత కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి 84వ జయంతి సందర్భంగా నెక్లె్‌సరోడ్‌ పీవీ మార్గ్‌లోని స్ఫూర్తిస్థల్‌లో మంత్రులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు.

ఆదర్శ నేత.. జైపాల్‌రెడ్డి: ఉత్తమ్‌

  • దివంగత కేంద్ర మాజీ మంత్రికి సీఎం, మంత్రుల నివాళులు..

హైదరాబాద్‌/రాంగోపాల్‌పేట్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): దివంగత కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి 84వ జయంతి సందర్భంగా నెక్లె్‌సరోడ్‌ పీవీ మార్గ్‌లోని స్ఫూర్తిస్థల్‌లో మంత్రులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. జైపాల్‌రెడ్డి ఒక ఆదర్శ రాజకీయ నాయకుడని.. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా దేశానికి గొప్ప సేవ చేసిన మహా నేత అని కొనియాడారు. స్ఫూర్తి స్థల్‌లో నివాళులర్పించిన వారిలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారు. కాగా, తెలంగాణ ప్రజల హక్కుల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రమంత్రిగా జైపాల్‌రెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డికి ఆయన నివాళులర్పించారు. ఇటు గాంధీభవన్‌లో జైపాల్‌రెడ్డి చిత్రపటం వద్ద కాంగ్రెస్‌ నేతలు కుమార్‌రావు, అల్లం భాస్కర్‌, ఎం.ఎ్‌స.అన్సారీ తదితరులు నివాళులర్పించి.. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

Updated Date - Jan 17 , 2026 | 06:45 AM