kumaram bheem asifabad- గిరిజనులు పిల్లల చదువుపై దృష్టి సారించాలి
ABN , Publish Date - May 03 , 2026 | 10:40 PM
గిరిజనులు పిల్లల చదువుపై దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో మంద మకరంద అన్నారు. మండలంలోని మార్లవాయి గ్రామాన్ని ఆదివారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరంద సందర్శంచారు.
జైనూర్, మే 3 (ఆంధ్రజ్యోతి): గిరిజనులు పిల్లల చదువుపై దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో మంద మకరంద అన్నారు. మండలంలోని మార్లవాయి గ్రామాన్ని ఆదివారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరంద సందర్శంచారు. ఆదివాసీ పీవో మంద మకరందకు గ్రామస్థులు ఘన స్వాగతం పలకారు. ఈ సందర్భంగా ఆయన కుమరం భీం, ఆదివాసీల ఆత్మబంధువు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ దంపతుల స్ఫూర్తితో గిరిజనులు అభివృద్ధి దిశలో సాగాలన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో గిరిజన ప్రాంత అభివృద్ధి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గిరిజనులు తమ పిల్లలను చదివించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. స్థానిక సర్పంచ్ కనక ప్రతిభవెంకటేశ్వరావు మాట్లాడుతూ రాఘాపూర్ నుంచి మార్లవాయి వరకు రోడ్డు నిర్మించాలని పీవో మకరందను కోరారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఏర్పాటు చేసిన హైమన్ డార్ఫ్ రీడింగ్ లైబ్రరీ, కాటేజ్, పద్మశ్రీ కనకరాజు గుస్సాడి శిక్షణ కేంద్రం, 1941లో డార్ఫ్ దంపతులు నివాసించిన ఇల్లును పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి పలు విషయాలు ఆడిగి తెలుసుకున్నారు. గతంలో ప్రభుత్వం నుంచి మంజూరైన అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాని గ్రామస్తులు పీవోను కోరారు. కార్యక్రమంలో డీడీ రమాదేవి, ఏటీడీవో శ్రీనివాస్, గ్రామ పటేల్ ఆత్రం మాణిక్‌రావు, కనక గణపత్‌రావు, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ పీవోగా బాధ్యతలు చేపట్టిన మంద మకరందు ఆదివారం జిల్లా కలెక్టర్ కె హరితను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారు చర్చించారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని జోడేఘాట్‌ను ఇటీవల ఐటీడీఏ పీవోగా బాధ్యతలు స్వీకరించిన మంద మకరందు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కుమరం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మ్యూజియంను సందర్శించారు. ప్రాంతీయ చరిత్ర, గిరిజనుల పోరాట గాధల వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.