భూ ఆక్రమణను అడ్డుకున్న ఆదివాసీలు
ABN , Publish Date - Jul 25 , 2026 | 10:39 PM
మండలంలోని రొ ట్టెపల్లి, తిర్మలాపూర్ అటవీ శివారు ప్రాంతంలోని భూముల ను ఇటీవల టీఎస్‌ఎండీసీ (తెలంగాణ స్టేట్ మినరల్ డెవల ప్‌మెంట్‌కార్పోరేషన్)కు ధారాదత్తం చేసింది.
కాసిపేట, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని రొ ట్టెపల్లి, తిర్మలాపూర్ అటవీ శివారు ప్రాంతంలోని భూముల ను ఇటీవల టీఎస్‌ఎండీసీ (తెలంగాణ స్టేట్ మినరల్ డెవల ప్‌మెంట్‌కార్పోరేషన్)కు ధారాదత్తం చేసింది. దీంతో భూము లను స్వాధీనం చేసుకునేందుకు టీఎస్‌ఎండీసీ అధికారులు, కొందరు గుత్తేదారులు శనివారం రొట్టెపల్లి అటవీ శివారు భూముల్లోకి హద్దులు ఏర్పాటు చేసేందుకు వచ్చారు. ఇది తెలుసుకున్న ఆదివాసీ గిరిజన గూడాలు ప్రజలు వారిపై తి రగబడ్డారు. దీంతో అధికారులకు, ఆదివాసీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాసేపు ఉద్రిక్త వాతావ రణం నెలకొంది. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెంద్రం హ న్మంతు మాట్లాడుతూ రొట్టెపల్లి పంచాయతీ పరిధిలోని పాత తిర్మలాపూర్ కొలాం గిరిజనులకు అన్నలకు ఆశ్రయం కల్పిస్తున్నారనే నెపంతో మూడు దశాబ్దాల క్రితం పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిసి గిరిజన కుటుంబాలను అటవీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించారన్నారు. . అలాగే ఉపాధి కోసం ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల సాగు భూమి ఇచ్చి ఉపాధి చూపించార న్నారు. కానీ ప్రభుత్వం టీఎస్‌ఎండీసికి అప్పగించి దేవాపూర్ సిమెంట్ కంపెనీకి అప్పగించేందుకు కుట్రలు పన్నుతుం దన్నారు. దీంతో ఆదివాసీ గిరిజనులను సాగు భూముల్లోకి వెళ్లగొట్టేందుకు అధికారులను పంపి భయబ్రాంతులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా సాగు చేసు కుంటున్న భూముల్లోకి అక్రమంగా వస్తే జరిగే పరిణామా లకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. నెలకు ఒకసారి భూముల్లోకి వచ్చి గిరిజనులను బెదిరిం పులకు గురి చేస్తున్నారని ఈ విధానాలను మానుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. హద్దులు ఏర్పాటు చేసేం దుకు వచ్చిన వారిని అడ్డుకోవడంతో వారు తిరిగి వెళ్లిపో యారు. ఆందోలన ఆదివాసీలు ఆందోళన విరమించారు. రొ ట్టెపల్లి సర్పంచు ఆత్రం కళావతి, భూబాధిత కుటుంబాలు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.